వీటిని నూనెలో వేసి రాయండి.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!


 అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందరూ జుట్టు విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చాలామంది జుట్టు విషయంలో ఖరీదైన చికిత్సలు కూడా తీసుకుంటుంటారు. కానీ కరివేపాకు, మందార ఆకులు, వేప ఆకులతో కలిపిన నూనెను వాడితే అద్భుత ప్రయోజనాలున్నాయి. వీటికి గోరింటాకు ఆకులను కూడా కలిపితే జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి సహజ పద్ధతిలో జుట్టును పెంచుతాయి కాబట్టి వెంటనే ప్రయోజనాలు కనపడవు.. కాస్తంత ఓర్పు ఉండాలి.. ఎక్కువ కాలం ఉపయోగించాలి.. అప్పుడే మంచి ఫలితాలను అందుకుంటారు.


పార్లర్లలో చేసే చికిత్సలకు దూరంగా ఉండాలి. వాటిల్లో కెమికల్స్ ఉంటాయి. కరివేపాకును మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేయాలి. దాన్ని కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. దాన్ని చల్లబరిచిన తర్వాత తలకు పట్టించాలి. నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఒక గంటసేపు అలా వదిలేసి తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి. కరివేపాకుతో హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా జుట్టు పెరుగుతుంది.

మందార ఆకులను పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మృదువుగా మారతాయి. మందార ఆకులను గోరింట ఆకులతో కలిపి రుబ్బుకోవాలి. వాటికి వేప ఆకులను కూడా జోడించాలి. తలలో దురదను దగ్గిస్తుంది. ఈ పేస్ట్ లో పెరుగు కూడా కలుపుకోవచ్చు. తలపై ఈ పేస్ట్ ను పూర్తిగా పట్టించి గంటసేపు అలా వదిలేయాలి. అనంతరం తలస్నానం తర్వాత జుట్టు ఆరిపోవడానికి ఎటువంటివి వాడొద్దు. తడి జుట్టు దానంతటదే ఆరిపోనివ్వాలి. హెయిర్ డ్రయ్యర్ ను అసలు వాడొద్దు. జుట్టు ఆరిపోయిన తర్వాత కావాలంటే నూనె రాసుకోవచ్చు.

Disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని BCN TV ధ్రువీకరించలేదు.