ఒక సీనియర్ జర్నలిస్టు ఆవేదన వ్యక్తం..
61 ఏళ్ల ప్రాయంలో.. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా... నాకు లభించిన ఆధారంతో... జరుగుతున్న కుట్రను బయట పెట్టకుండా ఉండలేక... మీ అందరి దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వస్తున్నా.. క్షమించండి...
పాత్రికేయ వృత్తిలో ఎన్నో ఒడిదుకులు చవి చూశాను. ప్రతి ఎన్నికల సమయంలో... రాష్ట్రంలో జర్నలిస్ట్ లు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఊరించటం.. ఆ తరువాత ఓడిపోవటం... జర్నలిస్తుల కథ కంచికి చేరటం.. నాకు బాగా తెలుసు. ఇటీవల ప్రభుత్వం కూడ అదే స్లోగన్ ఇచ్చింది. సరే.. కృష్ణా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు కాస్త ఎక్కువగానే స్పందించారు. 40 మందికి పైగా రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి జాబితా తయారు చేశారు. కనీసం జీతాభత్యాలు లేని రిపోర్టర్లకు 40 శాతం ధరతో ఇళ్ల స్థలాలు ఇన్నేళ్లకు దక్కుతున్నందుకు జర్నలిస్టులు ఎంతో ఆనందించారు.
ప్చ్.. జర్నలిస్తుల కొండంత ఆశల్ని.. బుట్ట దాఖలు చేసిన ఘనత డీపీఆర్ఓ సిబ్బంది కి దక్కిందంటే కేవలం ఆరోపణ కాదు. జర్నలిస్టుల ఇళ్ల కు చెందిన అతి కీలక ఫైల్ ఎలా చెత్త బుట్టను చేరింది. అక్రిడెషన్ కమిటీ సమావేశం తీర్మానం కాపీలో... ఇంచార్జి మంత్రి రోజా.. జిల్లాలోని ఆర్డీఓ లు.. జిల్లా రెవెన్యూ అధికారి.. ముగ్గురు పాత్రికేయ సభ్యులు సంతకాలు చేసిన పేజీని ఎందుకు చించారు. కడకు ఇళ్ల స్థలాలు ఇస్తామని 40 పేర్లతో జాబితాను ఎందుకు బుట్ట దాఖలా చేశారు. ఎలక్షన్ కోడ్ అమలు జరుగుతోంది. జూన్ 4 వరకు ఈ ఫైల్ తో పని లేదు. ఆ తరువాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఇదేళ్లకు గొంతు సవరిస్తుంది. కానీ డీపీఆర్ఓ సిబ్బంది... ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారో.. విచారణ జరిపించండి... ఇందుకు ఈ ఆధారంగా విడియో పరిశీలించగలరు... సార్
వినమ్రతతో
బి. బాబు బహదూర్
సీనియర్ జర్నలిస్ట్
మచిలీపట్నం
ఈ ఘటనకు స్పందించిన కలెక్టర్ రాజాబాబు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సోషల్ మీడియాలో వచ్చిన కదనంపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు..
కదనం పై వెంటనే స్పందించి ఈ విషయం పై జాయింట్ కలెక్టర్ ను విచారణ చేయమని ఆదేశించారు.. విచారణలో బాద్యులను గుర్తించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.. ఇళ్ల స్థలాలకు సంబందించిన దరఖాస్తు లు ఆన్లైన్ లో ఉంటాయి. కాబట్టి జర్నలిస్ట్ లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు..