భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఫోన్
ఏలూరు జిల్లా ఏలూరు: జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న కారణంగా జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఈ విషయంపై జిల్లాలో అత్యధిక వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో అధికారులు అందరిని అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసారు. వెలేరుపాడు పెద్దవాగులో కొట్టుకపోయిన కారు ఆచూకీ కోసం అవసరమైతే హెలికాప్టర్ ను వాడాలని అధికారులకు సూచించారు.
అదేవిదంగా ఈ వర్షాలు వలన వైరల్ ఫీవర్స్ మరియు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వైద్యులను, సానిటరీ డిపార్ట్మెంట్ ను అందుబాటులో ఉంచాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసి ఉంచాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
ఈ వర్షాలు వలన వాగులు వంకలు పొంగుతాయని ప్రజలు గమనించి ప్రయాణాలు చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలిని తెలిపారు. ఈ వర్షాలు సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు, ప్రయాణికులు చెట్టల క్రింద నిల్చోని ఉండరాదని చెప్పారు. ఈ వర్షాలు వలన ఏదైనా అవసరమైతే అత్యవసర సమయంలో జిల్లాలోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో ఉన్న +91 98855 19299 నంబర్స్ కు సంప్రదించాలని చెప్పారు. అలాగే వరద సహాయక ఫోన్ నెంబర్ +91 83339 05022 కాల్ చేసి తెలిపాలన్నారు.