డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం: ముని బాలయోగి స్వామి ఆలయాన్ని ఎంపీ హరీష్ బాలయోగి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో ప్రాముఖ్యత గల బాలయోగి స్వామిని దర్శించుకోవడం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు.
బాలయోగి ఆశ్రమంలో కొన్ని ముఖ్య పనులకు ఆలయ కమిటీ సభ్యులు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ ల్యాండ్స్ తో ఆశ్రమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా తండ్రిగారు జిఎంసి బాలయోగి, స్వామివారి భక్తులని ఎప్పుడు ముమ్మిడివరం వచ్చినా బాలయోగి స్వామిని దర్శించుకునే వారిని కొందరు పెద్దలు నా దృష్టికి చెప్పడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. నేను కూడా స్వామివారి సేవలో ఉంటానని ప్రతి కార్యక్రమానికి భక్తి భావంతో కార్యక్రమాలు జరిగించుటకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో తాళ్ళరేవు మండలం నుండి 30 మంది మహిళలు వచ్చి ఎంపీ హరీష్ కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో గన్నవరం మాజీ శాసనసభ్యులు అయ్యా జి వేమ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లె అశోక్, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ, దొమ్మేటి రమణ కుమార్, గొల్లపల్లి గోపి, చిక్కాల అంజిబాబు, మెండి కమల, నడింపల్లి శ్రీనివాసరాజు, ఏళ్ల ఉదయ్, దాట్ల బాబు, కాశి మూర్తి, కాశి రామచంద్రరావు, పితాని శ్రీనివాస్, కటికదళ నాని, కటికదల సుబ్బారావు, కటికదల బాలకృష్ణ, పోతుముడి రామకృష్ణ, కొయ్యల దుర్గ, కాశి లాజర్, మెండి రాజశేఖర్, గడ్డం శ్రీనివాస్, జక్కం ప్రసాద్, బూరుగు కళ్యాణ్, చిక్కాల పరశురాం, ఎస్ఎంఎస్ ప్రసాద్, పితాని నరసింహామూర్తి, ఎలమంచిలి బాలరాజు, నీతి పూడి వంశీ, మొదలగు వారు పాల్గొన్నారు.