అమలాపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతనంగా ఏర్పడిన తరువాత మూడవ జిల్లా జాయింట్ కలెక్టర్ గా టి. నిషాoతి బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా జాయింట్ కలెక్టర్ చాoబర్ నందు కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.
తొలుత వేద పండితులు పూర్ణకుంభంతో జెసి శ్రీమతి టి. నిషాoతి వారికి స్వాగతం పలికిన పిదప వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ నడుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆమెకు ఆశీర్వచనాలు పలికారు. తమిళనాడుకు చెందిన టి. నిషాoతి 2017 ఐ ఏ ఎస్ బ్యాచ్ కు చెంది ఆంధ్రప్రదేశ్ కేడర్ లో తొలుత ప్రకాశం జిల్లాలో సహాయ కలెక్టర్ గా శిక్షణ పొందారు. తదుపరి పెనుగొండ సబ్ కలెక్టర్ గా పనిచేశారు.
అదేవిధంగా అనంతపురం జిల్లాలో గృహ నిర్మా ణ సంస్థ జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. నంద్యాల జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. అమరావతిలోని రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ బదిలీపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా నియమింపబడ్డారు.
ఉత్తమ అధికారిగా కూడా టి నిషాoతి పేరు ప్రఖ్యాతులు గడించారు తొలుత స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, రామచంద్రపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ సుధాసాగర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ తదితరులు ఆమెకు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.