పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు


నిర్వహణ కోసం కృష్ణాజిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ కలిసి రూ.50 లక్షల విరాళమిస్తాం: కొల్లు రవీంద్ర


మచిలీపట్నం టౌన్‌: పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాం టీన్లు మళ్లీ ప్రారంభిస్తు న్నామని వాటి నిర్వ హణ కోసం కృష్ణాజిల్లా లోని ఏడుగురు ఎమ్మె ల్యేలు, ఎంపీతో కలిసి రూ.50 లక్షలు విరా ళంగా అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీప ట్నం మూడు స్తంభాల సెంటర్‌లో అన్న కాంటీన్‌ను ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి ఆయన ప్రారంభించారు. పేదలకు టిఫిన్‌ వడ్డిం చారు. వారితో కలిసి మంత్రి పూరీలు తిన్నారు. జగన్‌ సీఎం అయ్యాక అన్న కాంటీన్లు రద్దు చేశారని, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను రద్దు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కొల్లు రవీంద్ర హెచ్చరిం చారు. 

పేదలు హోటల్‌కు వెళ్లి భోజనం చేయాలంటే రూ.80 నుంచి రూ.100 ఖర్చవుతోందని, సీఎం చంద్రబాబు, ఉపముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తు న్నారని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, మునిసిపల్‌ కమిషనర్‌ బాపిరాజు, అక్షయపాత్ర సమన్వయ కర్త ఆషిబాబు, బాబా ప్రసాద్‌, మాదివాడ రాము, గోపాల్‌ పాల్గొన్నారు.

రూ.2 లక్షల విరాళం
మచిలీపట్నానికి చెందిన వైద్యుడు బి.ధన్వంతరీఆచార్య అన్న క్యాం టీన్‌ నిర్వహణకు ఏటా ఆగస్టు 15న రూ.లక్ష ఇస్తామన్నారు. రూ.లక్ష చెక్కును మంత్రికి అందించారు. తన కుమారుడు ఆశ్రిత్‌ తొలి జీతం రూ.లక్ష చెక్కును జనసేన నాయకుడు మాదివాడ రాము అందజేశారు.