ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల జాబితా రెడీ.. లిస్ట్ ఇదే...?


AP NEWS: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత నుంచి ఆయా పార్టీల‌ నాయ‌కులు నామినేటెడ్ ప‌ద‌వుల‌పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కొన్నాళ్లుగా దీనిపై క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న ఫైనల్ చేశార‌ని చెబుతున్న నామినేటెడ్ ప‌ద‌వుల జాబితా ఒక‌టి సోష‌ల్ మీడియాలోనూ.. అదేవిధంగా టీడీపీ నాయ‌కుల మ‌ధ్య కూడా చ‌ర్చ‌గా మారింది. దీంతో ఒక్క‌సారిటీ టీడీపీ నాయ‌కుల్లోనూ ఉత్సాహం నెల‌కొంది. ప్ర‌స్తుతం దీనిపైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.


ఇదీ.. జాబితా..
టీటీడీ చైర్మన్ గా టీవీ 5 అధినేత బి.ఆర్ నాయుడు, ఏపీఐఐసీ చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రాహ్మణ చౌదరి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, శాప్ చైర్మన్ గా పొలం రెడ్డి దినేష్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ గా రెడ్డి వాణి. ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నీలాయపాలెం విజయకుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా గంప కృష్ణ, ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సోము వీర్రాజు పేర్లువినిపిస్తున్నాయి.

అదేవిధంగా ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డ్ చైర్మన్ గా షేక్ రియాజ్‌, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బొబ్బూరి వెంగళరావు, ఏపీ గ్రేనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బండ్రెడ్డి రామకృష్ణ, ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్ గా పాతూరు నాగభూషణం, ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిమ్మల క్రిష్టప్ప, ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాతల‌కు ప‌ద‌వులు ద‌క్క‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఏపీ ఎస్ఎంఐడిసి చైర్మన్ గా రాయపాటి అరుణ, తుడా చైర్మన్ గా దివాకర్ రెడ్డి, నెడ్ క్యాప్ చైర్మన్ గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా యాక్టర్ పృథ్వి(జ‌న‌సేన కోటాలో), అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ADC ) చైర్మన్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.