మాలల మహా గర్జనకు లక్షలాదిగా తరలి వెళదాం.. మాల మహాసేన జాతి అధ్యక్షులు ఆలగ రవికుమార్


ELURU: మాలల మహా గర్జనకు లక్షలాదిగా తరలి వెళదామని మాల మహాసేన జాతి అధ్యక్షులు ఆలగ రవికుమార్ పిలుపునివ్వడం జరిగింది. అఖిల భారత మాల సంఘాల జై.ఏ.సి ఆధ్వర్యంలో హలో మాల చలో అమరావతి అనే నినాదంతో మాలల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పిలుపుమేరకు లక్షలాదిగా తరలి రావాలని మాల మహాసేన జాతి అధ్యక్షులు అలగ రవికుమార్ పిలుపునిచ్చారు.
 
ఆదివారం ఉదయం 10 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియం వద్ద ఉన్న లేడీస్ క్లబ్బు నందు జరిగిన పత్రికా సమావేశంలో మాల మహాసేన నాయకులు మాట్లాడారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పళ్లెం ఏడుకొండలు, రాష్ట్ర అధ్యక్షులు కొమ్మిన అగస్టీన్, వాసే రత్నం మాట్లాడారు. ప్రతి గ్రామం నుండి అంబేద్కర్ సంఘాలు, డ్వాక్రా సంఘాలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి సత్తా చూపించాలని కోరారు.
 
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దయచేసి పునరాలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాలలు మాల సంఘాలు చేసిన కృషిని గుర్తించాలని, మాల అభిప్రాయాల్ని కూడా గౌరవించాలని అన్నారు.

నాయకులందరూ"వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు, జిల్లాల నాయకులు, రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారని, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా అలగ రవికుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా మాల మహాసేనలో మరి కొంతమంది జేరడం మాకు మరింత బలం చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడిదేసి విజయ్, గోలే విజయ్, కర్ని కోటి దిలీప్, ఆనందరాజు, లంకపల్లి బాలు, పి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.