టి నరసాపురం: విలువైన ఎన్నో రూపాలను అప్పటికి, ఇప్పటికి, ఏనాటికైనా నిలిచిఉండేలా చేసేది ఫొటో మాత్రమేనని టి నరసాపురం ఏ ఎస్ ఐ జయకుమార్ అన్నారు. మండల ఫొటో గ్రాపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే బస్ షెల్టర్ వద్ద శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత ముందుకు వెళ్ళాలని సూచించారు. మండల ఫొటో గ్రాపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంఘటితో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన అధ్యక్షునిగా పి వేంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి చిన్నా మాట్లాడుతూ.. ప్రతి టెక్నాలజీ లోనూ ఫొటొ గ్రాఫర్ ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని, ప్రతి క్షణాన్ని ఒక మధుర క్షణంగా చూపించేది ఫొటొనేనని కొనియాడారు.
నూతన అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఫొటో గ్రాఫర్ కు ముఖ్యంగా ఉండాల్సింది క్రమశిక్షణ ఆని అన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతతో ఉంటూ యునియన్ ను క్రమశిక్షణతో ముందుకు తీసుకొని వెళతానన్నారు. అంతే కాకుండా గత ఏడాది విద్యార్థుల కోసం బస్ షెల్టర్ నిర్మించడం జరిగిందని, మునుముందు మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు యూనియన్ సహకారంతో చేపడతామన్నారు.