విశాఖపట్నం: గాజువాక హై స్కూల్ రోడ్ సాయిరాం నగర్ 67వ వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఈరోజు పాఠశాల పరిసర ప్రాంతాలలో "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ ఆంధ్ర" కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అగ్రస్థానంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు స్వామి విద్యానికేతన్ స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులతో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు 67వ వార్డులో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విద్యార్థులచే ప్రతిజ్ఞలో భాగంగా విద్యార్థులలో మొట్టమొదటిగా "నాతో ప్రారంభించి.. నా కుటుంబం, నా వీధి, నా ఊరు, నేను చదువుతున్న పాఠశాలలో ఈ కార్యక్రమము మొదలు పెడతానని" ప్రతిజ్ఞ పిల్లలందరితో చేయించడం జరిగింది.
విద్యార్థులతో ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని తదుపరి భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను అని చెప్పిస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ రీ యూజిబుల్స్ వంటి థీమ్లు నిర్వహించాలని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెబుతూ స్వచ్ఛభారత్ ఉద్యమం లక్ష్యంలో భాగంగా కార్యక్రమాల నిర్వహణకు సాధారణ ప్రజలు కృషిని ప్రజల్లో చర్చేందుకు సమాంతరంగా "మై క్లీన్ ఇండియా" ప్రారంభించబడిందని విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి విద్యానికేతన్ విద్యార్థులతో పాఠశాల ఇంచార్జ్ గరిమెళ్ళ పద్మజా పూర్ణ మరియు గైడ్ టీచర్ తూర్పాటి సూర్య కుమారి లు పాఠశాల పి ఈ టి ఉపాధ్యాయుడి రేగు మోహన్ సహకారంతో పాఠశాలలో కాకుండా పాఠశాల పరిసర ప్రాంతాలు 67వ వార్డులో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆయా కార్యక్రమాలపై వ్యాసరచన, డిబేట్, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ పాలూరు దేవి సహకారంతో విద్యార్థులకు విజ్ఞానదాయక, వినోదదాయక పుస్తకాలను బహుమతులుగా విద్యార్థులకు ఇప్పించడం జరిగింది.
పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని గోగాడ లక్ష్మి మాట్లాడుతూ ఈనాటి విద్యార్థి రేపటి బ్రాండ్ అంబాసిడర్ గా మారాలని విద్యార్థులలో స్ఫూర్తినింపారు. మోహన్ తోపాటు అచ్యుతుని లక్ష్మి పాఠశాల పరిసరాలలో గల పూల మొక్కలను వివిధ రకాల మొక్కలను ట్రిమ్ చేసి మరింత అందంగా ఆకర్షణీయంగా మొక్కలు కనిపించేటట్లు కీలక పాత్ర పోషించారు.