Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ రాయదుర్గం మైహోం భుజాలోని అపార్ట్‌మెంట్స్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏ కేసులో అరెస్ట్?
అనంతపురం జిల్లా ఒబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసు నెంబర్ 65/2025 కింద పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 196, 353(2), 111, అలాగే BNS చట్టం 3(5) కింద అతనిపై అభియోగాలు మోపారు.
ఈ కేసును పోలీసులు కోగ్నిజబుల్ (స్వయంచాలకంగా విచారణ జరిపే), నాన్-బెయిలబుల్ (జామీన్ లభించని నేరం) అని పేర్కొన్నారు. అందుకే పోసానిని రాజంపేటలోని ప్రథమ అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎందుకు అరెస్ట్ చేసారు?
ఇప్పటికే రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నట్టు పోసాని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఆయన చేసిన వివిధ రాజకీయ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అనంతపురం జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో కూడా పోసానిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అనంతపురం పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఎక్కడ అరెస్ట్ చేశారు?
పోలీసుల సమాచారం ప్రకారం, హైదరాబాద్ రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసానిని ఏపీ రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత అతడిని రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFTVDC) ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతల ఫిర్యాదుతో CID పోసానిపై కేసు నమోదు చేసింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని అనవసరంగా లక్ష్యంగా చేసుకుని, తిరుమల కొండపై దోపిడీకి వచ్చారంటూ విమర్శించారు.
దీంతో బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరు వంటి వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పోసాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినప్పటికీ, గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా తాజాగా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.
Posani Krishna Murali arrested in a Non- Bailable Case
— Sravani Journalist (@sravanijourno) February 26, 2025
Gachibowli లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్న రాయిచోటి పోలీసుల.#PosaniKrishnaMurali pic.twitter.com/pv6V2N6akp