వృద్ధాశ్రమంలో టిడిపి నాయకురాలు కే. జగదీశ్వరి, పోతరాజు నరేష్ చౌదరి ఆధ్వర్యంలో అన్నదానం..
ఏలూరు జిల్లా, పోలవరం: నియోజకవర్గంలోని టిడిపి నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి, పోతరాజు నరేష్ చౌదరి నేతృత్వంలోఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పోలవరం మండల కేంద్రంలోని స్థానిక గోదావరి వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలసి కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకురాలు కే. జగదీశ్వరి, పోతరాజు నరేష్ చౌదరి స్వయంగా వృద్ధులకు భోజనం వడ్డించి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కె. జగదీశ్వరి, పోతరాజు నరేష్ చౌదరి మాట్లాడుతూ పేద కుటుంబాల విద్యాదాత కృష్ణ, గుంటూరు ఎమ్మెల్సీ మరియు మాజీ మంత్రి అలాగే తెనాలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించి, వారికి అండగా ఉండాలని జగదీశ్వరి, నరేష్ చౌదరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్ నాయక్, నరేష్ చౌదరి, చెల్లూరి, సత్యనారాయణ, చెల్లూరి వెంకట అప్పారావు, ఆదిత్య అబ్దుల్ రజాక్, రాహుల్ దొర, రాజేంద్ర ప్రసాద్ దొర, అంబటి అరుణ, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.