అమెరికాకు కొడాలి నాని... వైద్యుల కీలక సూచనలు?


ANDRAPRADESH, KRISHNA, GUDIVADA: గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతోన్న మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ఇటీవల ముంబైలో బైపాస్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. By:  BCN TV NEWS అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్న వేళ.. తాజాగా ఆయన అమెరికాకు వెళ్లనున్నారని తెలుస్తోంది. దీంతో.. కొడాలి నాని ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కొడాలి నానికి ఇటీవల ముంబైలో గుండెకు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. తొలుత హైదరాబాద్ లో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. గుండెలో మూడు రక్తనాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బైపాస్ అవసరమని ప్రత్యేక విమానంలో ముంబై తరలించారు. 


అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో సుమారు ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తర్వాత కొడాలి నాని కొంతకాలం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. ఈ సమయంలో రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో నానీని జగన్ ఫోన్ లో పరామర్శించారు. ఈ సమయంలో నానీ పూర్తిగా విశ్రాంతిలోనే ఉన్నారు. అత్యంత ముఖ్యమైనవారిని మినహా ఎవరినీ కలవటం లేదని చెబుతున్నారు. ఈ సమయంలో.. కొడాలి నానీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందల్సిన అవసరం లేదని.. పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. 

ఇందులో భాగంగా... కొడాలి నాని అమెరికా వెళ్లనున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలోనే ఈ మేరకు ఆలోచన చేసినప్పటికీ.. సర్జరీ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం వెళ్లాలని వైద్యులు సూచించడంతో ఇప్పుడు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు మెరుగైన చికిత్సతో పాటు, విశ్రాంతి కోసం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో... ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి గుడివాడకు రావాలని, ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు!