ANDRAPRADESH, KADAPA: ''మహానాడు వచ్చింది.. BY: BCN TV NEWS మీరు మీరు కొట్టుకోకుండా.. పార్టీకి మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టండి'' అని పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు నాయకులకు వారం కిందటే సూచించారు. పార్టీ నాయకులకు వాట్సాప్ ద్వారా కూడా.. సమాచారం చేరవేశారు. కానీ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మాత్రం నాయకుల తీరు మారడం లేదు. అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి సవిత వర్గానికి వ్యతిరేకంగా ఉన్న వారు.. సొంత అజెండా అమలు చేస్తున్నారు.
ఇక, కర్నూలులో ఆళ్లగడ్డ, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భూమా అఖిల ప్రియతో నడిచేది లేదని.. నాలుగు మండలాల నాయకులు తేల్చి చెప్పారు. దీంతో స్థానికంగా ఉన్న నాయకులతోనే కలిసి వారు మహానాడుకు రెడీ అయ్యారు. అయితే.. వీరికి బస్సులు ఇవ్వొద్దని.. వాహనాలు ఏర్పాటు చేయొద్దని ఎమ్మెల్యే హోదాలో అఖిల ప్రియ ఆంక్షలు పెట్టారు. దీంతో సమీప ప్రాంతాలకు చెందిన స్కూళ్ల యజమానులు బస్సులు ఎవరికి కేటాయించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఆర్టీసీ అధికారులకు కూడా ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇలానే ఆదేశాలు జారీ చేశారు. ఇక కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్.. తన సొంత మానాన తనున్నారు. తన వర్గం వారిని కలుపుకొని వెళ్లే ప్రయత్నంలో ఉన్నా రు. మంత్రి టీజీ భరత్.. బస్సులు పెడతాను.. అని చెప్పినప్పటికీ కేఈ వర్గం మౌనంగా ఉంది. ఇక, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోనూ.. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాను ఒక్కడే వెళ్లి మహానాడులో కూర్చున్నారు. నియోజకవర్గంలో పార్టీ తరఫున పరివారాన్ని తీసుకువచ్చే విషయాన్ని ఆయన వదిలేశారు.
విజయవాడలోని పశ్చిమలో అసలు పార్టీ తరఫున ఎవరూ కూడా కార్యకర్తలను మొబిలైజ్ చేయడం లేదు. వాస్తవానికి బుద్ధా వెంకన్నకు మహానాడులో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ, ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన అలిగారు. అయితే.. పైకి మాత్రం బాగానే ఉన్నా.. అంతర్గతంగా మాత్రం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో అసలు.. పార్టీ సందడి లేకుండా పోయింది.