దిశా నిర్దేశం
ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్య క్రమం ఎలా నిర్వహించాలి.. ప్రజలకు ఏమేం వివరించాలన్న అంశాలను చర్చించడంతోపాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలపై సదరు సమావేశంలో అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజ కవర్గ ఇన్‌చార్జులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. ఏడాది కాలంలోనే ప్రభుత్వం సాధించిన విజయాలు.. తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు ఏ విధంగా వివరించాలో చంద్రబాబు మార్గదర్శకం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసారు.
టార్గెట్ జగన్
ఇక, వైసీపీ అటు టీడీపీకి కౌంటర్ గా 'చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..' పేరుతో కార్ యక్రమం చేపట్టనుంది. దీంతో, వైసీపీని ఫిక్స్ చేసే విధంగా తమ కార్యక్రమం ముందుకు తీసు కెళ్లటం పైన చంద్రబాబు చేసే సూచనలు కీలకం కానున్నాయి. జగన్ వరుస పర్యటనలు.. వివాదా ల గురించి వివరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన సత్తెనపల్లి పర్యటన.. ముగ్గురు ప్రాణాలు కోల్పోవటం.. జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు వదలటం వంటి అంశాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఇటు జగన్ తన పైన నమోదైన కేసు లో హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. జగన్ ను ఫిక్స్ చేసే విధంగా కూటమి నాయకత్వం కొత్త అడుగులు వేస్తోంది. ఇటు జగన్ కౌంటర్ రాజకీయం మొదలు పెట్టారు. దీంతో, రెండు పార్టీల మధ్య మొదలైన హోరా హోరీ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi