HYDERABAD:దాదాపు 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ జలాశయంలో అద్భుతం జరిగింది. ఈ ఏడాది జులై పూర్తయ్యే నాటికే నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో తెలంగాణ మంత్రులు 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జులైలోనే నాగార్జున సాగర్ నిండటం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 13, 14 గేట్లను ఎత్తి నీరు విడుదల చేశారు. మొత్తం 8 గేట్లు 8 ఫీట్లు పైకి ఎత్తి 68 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. 10, 11, 12, 13, 14, 15, 16, 17 గేట్లు ఎత్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సాగర్ప్రాజెక్టు నిండు కుండలా మారిందని అధికారులు తెలిపారు.
ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండగా మారింది. నీటిమట్టం గరిష్ఠ స్ధాయికి చేరుకుంది. ఈ మేరకు సాగర్ క్రస్ట్ గేట్లు ఇవాళ తెరుచుకున్నాయి. జులైలోనే నాగార్జున సాగర్ నిండటం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని.. నాగర్జున సాగర్ నుంచి 14 క్రస్ట్గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టులో సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. అయితే ఈసారి మహారాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాల వల్ల జలాశయానికి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఇక నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.60 అడుగులకు చేరుకుంది.
నాగార్జున సాగర్క్రస్ట్గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. సాగర్ నుంచి గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పునాది వేశారని ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆయన కుమార్తె ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పూర్తి చేసి ప్రారంభించారని తెలిపారు. ఈ జలాశయం ద్వారా 26లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోందన్నారు. తెలంగాణ వరి పండించడంలో రికార్టు స్థాయిలో ఉందని మంత్రి ఉత్తమ్ సంతోషం వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని స్పష్టం చేశారు.
మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రియదర్శిని జూరాల జలాశయానికి లక్షా 25 వేల క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా 14 గేట్లు ఎత్తి లక్షా 26 వేల 630 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు అధికారులు.