హైదరాబాద్ లో నర్సరీకి రూ.2,51,000 ఫీజా- నాయాల్ది కత్తి అందుకో జానకీ


HYDERABAD:ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల దోపిడీ.. లక్షల రూపాయల్లో అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తోన్నారనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. మన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. నర్సరీకి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేయడం వివాదాస్పదమైంది.

నర్సరీ కోసం ఏకంగా 2,51,000 రూపాయలను వసూలు చేసిందో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి.. ఫీజ్ స్ట్రక్చర్ తో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా యూజర్లు, నెటిజన్లు మండిపడుతున్నారు. సంబంధిత స్కూల్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధర్మ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు అనురాధ తివారీ ఈ పాఠశాల ఫీజుల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ యాన్యువల్ ఫీజుల వివరాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తోన్నారు. ఈ స్థాయిలో ఫీజులను వసూలు చేయడం ఎంతమాత్రం సరికాదని చెబుతున్నారు.

నర్సరీలో చేరడానికి అక్కడ టీచర్లు బోధించే ఏబీసీడీలు, బేసిక్ లెసన్స్ ను నేర్చుకోవడానికి నెలకు 21,000 రూపాయలను చెల్లించాలా? అని అనురాధ తివారీ ప్రశ్నించారు. ఇంత భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడానికి ఆ పాఠశాలల్లో ఏం బోధిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు.

ఆ ఫొటోలో పొందుపరిచిన ఫీజుల వివరాల ప్రకారం చూస్తే.. నర్సరీలో రూ.2,51,00, ప్రీ-ప్రైమరీ 1, 2 తరగతులకు రూ.2,42,700, 1, 2 తరగతులకు రూ.2,91,460, 3, 4 తరగతులకు రూ.3,22,350 వార్షిక ఫీజుగా ఉంది. దీన్ని ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసిందా స్కూల్ యాజమాన్యం.

భారతదేశంలో ప్రైవేట్ విద్య భారం అవుతోందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు భరించలేని వారు ఆ పాఠశాలకు పిల్లలను పంపించకూడదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదొక ఎడ్యుకేషన్ స్కామ్ లా ఉందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అని మరొకరు స్పందించారు.

"ఈ పాఠశాలలోనే పిల్లలను చదివించాలనే నిబంధన ఏమీ లేదు కదా? తల్లిదండ్రులు డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే ఇలాంటి పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి.." అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇతర ప్రాంతాల్లోని పాఠశాలల ఫీజులతో పోల్చి చూస్తున్నారు.

ఇది తక్కువే. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని కొన్ని స్కూల్స్‌లో నర్సరీ విద్యార్థుల ట్యూషన్ ఫీజు లక్ష రూపాయల పైనే ఉంది" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. "ఈ పాఠశాలల్లో అంత ప్రత్యేకత ఏముంది? లక్ష రూపాయలు ఫీజులు వసూలు చేసే స్కూల్స్‌కు దీనికి తేడా ఏంటి?" అని మరొక నెటిజన్ ప్రశ్నించారు. మరో యూజర్ స్పందిస్తూ.. "చాలా బాధాకరం. విద్య చాలా ఖరీదైపోయింది" అని కామెంట్ పోస్ట్ చేశారు.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now