తెలంగాణలో మందు బాబులకు పండగే.. ఇకపై ప్రతి 5 కి.మీ ఒక ..


HYDERABAD:జులై 28 న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో పాటు దాదాపు 25 అంశాలపై చర్చ జరిపారు. వీటిలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే వాహనాలను పరిశీలించేందుకు చెక్ పోస్టు దగ్గర సిబ్బందిని ఉంచడం కాకుండా, ఆధునిక వాహన్ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్‌డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగించనుంది.

అంతేకాక కేబినెట్ మీటింగ్ లో మైక్రో బ్రూవరీస్‌ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మైక్రో బ్రూవరీస్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రతి 5 కిమీలకు, పట్టణాల్లో 30 కిమీలకు ఒక మినీ బ్రూవరీలను ఏర్పాటు చేయనున్నారు. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ప్రాంతం, మున్సిపల్ కార్పొరేషన్లలో మినీ బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం మైక్రో బ్రూవరీస్ చట్టంలో.. అవసరమైన మార్పులు చేయనంది. నూతన మార్గదర్శకాలను త్వరలోనే అమలు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజా కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు కానున్నాయి. ఇన్ స్టంట్ బీర్ కేప్ లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం.. నగరంలో ప్రతి 5 కి.మీ. అలాగే పట్టణాల్లో అయితే ప్రతి 30 కి.మీ. లకు ఒకటి చొప్పున మినీ బ్రూవరీలు ఏర్పాటు కానున్నాయి. దాంతోపాటు త్వరలోనే మద్యం షాపుల లైసెన్స్ లకు కూడా నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక రెండు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలు పెంచిన విషయం తెలిసిందే. క్వార్టర్‌ పై రూ. 10, హాఫ్‌ పై రూ. 20, ఫుల్‌ పై రూ. 40 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు గతంలో పంపింది.



WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now