ANDHRAPRADESH:పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల ముహూర్తం ఎట్టకేలకు అధికారికంగా ఖరారు చేసారు. రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ నిధుల విడుదల ఆగస్టు 2న చేపట్టాలని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇప్పటికే అర్హుల జాబితా ఖరారు చేసారు. చంద్రబాబు ఆ రోజున ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అయితే, కౌలు రైతులకు మాత్రం రెండో విడతలోనే నిధులు జమ కానున్నాయి.
వీరి ఖాతాల్లోకి నిధులు
ఏపీ ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన విధంగా పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయనుంది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో ఈ పథకం ప్రారంభించనున్నారు. తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ 2,325 కోట్లు విడుదల చేయనుంది. కేంద్రం పీఎం కిసాన్ కింద రూ 831.60 కోట్లు అందించనుంది. మొత్తంగా తొలి విడతలో రూ 3,156.60 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే అర్హులైన రైతు కుటుంబల ఎంపిక పూర్తయింది. మరో 44,242 మందికి ఈ కేవైసీ, 44,101 మందికి ఎన్పీసీఐ మ్యాపింగ్ చేయాల్సి ఉంది. అయితే, కౌలు రైతుల విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు.
నిధుల జమ ఇలా
కౌలు రైతులకు తొలి విడత.. రెండో విడత కలిపి ఒకే సారి రెండో విడతలో చెల్లించాలని వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులతో పాటుగా రెండు విడత నిధులు రూ 10 వేలు కౌలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హత ఉన్నా జాబితాలో పేర్లు లేని రైతులు రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. పీఎం కిసాన్ ద్వారా వచ్చే రూ 2 వేలకు ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ 4 వేలు చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో రూ 20 వేలు జమ కానున్నాయి.
లాస్ట్ ఛాన్స్
తొలి విడత నిధులు ఆగస్టు 2న విడుదల చేయనున్న ప్రభుత్వం.. రెండో విడత నిధులను అక్టోబర్ - నవంబర్, మూడో విడతగా ఫిబ్రవరి-మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. ఇక, రైతు లు పేమెంట్స్టేటస్చెక్చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్ను ఓపెన్ చేసి, Know Your Status అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు Get OTP ఆప్షన్పై క్లిక్చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్చేస్తే స్క్రీన్పై మీ బెనిషియరీ స్టేటస్క్ కనిపిస్తుంది. అయితే, అర్హత ఉన్న ప్రతీ ఒక్కిరికీ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.