డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట మహోత్స.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి

ANDHRAPRADESH:డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: కొత్తపేట మండలం లో విశ్వభూషణ, బోధిసత్వ, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈరోజు కొత్తపేట గ్రామంలోని రెడ్డప్పవారి పేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి  పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోధించు,సమీకరించు,పోరాడు అనేటువంటి మూడు మాటలు ఆయన చెప్పారో.

అవే ఈరోజు కూడా మన జీవనశైలిని సక్రమంగా నడిపిస్తున్నాయని , మనమందరం సమానమే ఎవరూ గొప్పవారు కాదు ఎవరు చిన్న వాళ్ళు కాదు మనుషుల్లో సమానత్వం ఉండాలని తెలియజేసిన నాయకుడు ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  మాత్రమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధర్ రావు , కొత్తపేట మండల కన్వీనర్ ముత్యాల వీరభద్ర రావు , ముసునూరి వెంకటేశ్వరరావు , కొత్తపేట మండల యూత్ ప్రెసిడెంట్ గొల్లపల్లి స్వరూప రాజ్  తదితర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now