ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణా హైకోర్టులో ఊహించని షాక్

HYDERABAD:ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో ఆమెకు నిరాశ ఎదురయింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని ఆమె దాఖలు చేసిన పిటీషన్ విచారణ ఆమెకు షాక్ ఇచ్చింది. తాజాగా నేడు ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టివేసింది.

ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిది కీలక పాత్ర

ఇప్పటికే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం నిందితురాలిగా తేల్చింది. ఇక కోర్టు తీర్పు నేపథ్యంలో సిబీఐ ఆమెపైన విచారణ జరపనుంది . గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైనింగ్ ను అప్పగించటంలో శ్రీలక్ష్మి ముఖ్య పాత్ర పోషించారని ఆరోపణల నేపథ్యంలో ఆమె పైన కేసు నమోదయింది. సిబిఐ దీనిపై ప్రస్తుతం విచారణ జరుపనుంది.

కోర్టులో పోరాడుతున్న ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి

ఓబులాపురం మైనింగ్ కేసులో గత కొంతకాలంగా శ్రీ లక్ష్మీ పోరాడుతూనే ఉంది. ఈ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ను 2022 అక్టోబర్లో సిబిఐ కోర్టు కొట్టేసింది. సిబిఐ కోర్టు తన డిశ్చార్జి పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం శ్రీలక్ష్మి పిటిషన్ను అనుమతించింది. కేసు నుండి తప్పిస్తూ తీర్పును కూడా వెలువరించింది.

శ్రీలక్ష్మి కేసు విషయంలో జరిగిన పరిణామాలివే

ఆ తర్వాత సిబిఐ శ్రీ లక్ష్మీ కేసు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. మళ్లీ ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకొని తాజాగా విచారణ జరపాలని ఈ పిటిషన్ను తిరిగి హైకోర్టుకు పంపింది. దీనిని మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది.

శ్రీలక్ష్మి ఓబులాపురం మైనింగ్ కేసులో చేసిందిదే

ఇక సిబిఐ తరపు న్యాయవాది మళ్ళీ హైకోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓబులాపురం మైనింగ్ లీజ్ వ్యవహారం ముందుకు సాగిందని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఓబులాపురం మైనింగ్ లీజులు కట్టబెట్టడానికి శ్రీలక్ష్మి అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ తమ వాదనను వినిపించింది.

వాస్తవాలు బయటకు రానివ్వని శ్రీలక్ష్మి

ఈ కేసులో ఆరో నిందితురాలు శ్రీ లక్ష్మీ వాస్తవాలను బయటకు రానివ్వకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ నివేదించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆమె పిటీషన్ కొట్టేసింది అని తెలిపింది. ఇక ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్ పిటిషన్ లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారని, omc కి లీజుల మంజూరులో శ్రీ లక్ష్మీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, కింది కోర్టులో విచారణను ఎదుర్కోవలసిందే అని అని పేర్కొంది. ఈ క్రమంలోసిబిఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు ఆమె పిటీషన్ ను కొట్టివేసింది.


 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now