ప్రజలకు ప్రభుత్వానికి వారధి – బీజేపీ జనతా వారధి


ఎన్‌టీఆర్ జిల్లా/ఏలూరు జిల్లా, విజయవాడ/చాట్రాయి: ప్రజల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి “బీజేపీ జనతా వారధి – మీ సమస్య మా బాధ్యత” అనే నినాదాన్ని ఇచ్చారు.


ఈ కార్యక్రమం జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో అధికారికంగా ప్రారంభమైంది. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు అందరూ ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందజేస్తూ పరిష్కారానికి కృషి చేయాలని ఈ కార్యక్రమం ఉద్దేశం.


ప్రజల సమస్యల స్వభావాన్ని బట్టి ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు తదితర కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే బాధ్యతను బీజేపీ జనతా వారధి కార్యక్రమం తీసుకుంది.

ఈ నేపథ్యంలో విజయవాడలోని భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి లక్ష్మీప్రసన్న సమక్షంలో ఏలూరు జిల్లా జనతా వారధి కార్యక్రమం కన్వీనర్ లగడపాటి సత్యనారాయణ, కుర్ర సుబ్బారావు, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు శ్రీకర్, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు నెరసు నెల రాజు పాల్గొన్నారు.

ప్రతి సోమవారం నిర్వహించే జనతా వారధి కార్యక్రమానికి సంబంధించి ప్రజల వినతిపత్రాలను బీజేపీ నాయకులు గురువారం, శుక్రవారం, శనివారం ప్రజల వద్ద నుంచి స్వీకరిస్తారని తెలిపారు. సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేసి, దరఖాస్తుదారులను సోమవారం అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

చాట్రాయి మండల ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా తమ సమస్యలను దరఖాస్తు రూపంలో బీజేపీ నాయకులకు అందజేయాలని పిలుపునిచ్చారు. చాట్రాయి మండల కేంద్రంలో సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి నివాసం వద్ద ఉన్న బీజేపీ కార్యాలయంలో ప్రతి శనివారం, అలాగే చనుబండ గ్రామంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు శ్రీకర్ ప్రతి ఆదివారం దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now