శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సిట్...


శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సిట్.... పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు

పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి... మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష

-హింధువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
-పవన్ కళ్యాణ్ నీ సనాతన ధర్మం ఎక్కడికి పోయింది
-దేవున్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న చంద్ర బాబుపాప భీతిలేని చంద్ర బాబు పచ్చకుట్ర పన్నాడు

ANDRAPRADESH: సాక్షాత్తు కలియుగ దైవం అయిన శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారని, కల్తీ చేశారని అపవిత్ర అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి తెరతీశారని, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసి ప్రతిష్టను దిగజార్చిన వీరు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్పార విచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష డిమాండ్ చేశారు. శనివారం నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి స్వామివారికి పూజలు నిర్వహించారు. 

అనంతరం ఆలయం వెలుపల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, రాష్ట్ర మార్క్ఫెడ్ ఛైర్మన్ పీపీ నాగిరెడ్డి, రాష్ట్ర వై ఎస్సార్సీపీ కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నీసా, వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోనుశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అమృత రాజ్, మున్సిపల్ వింగ్ వైసీపీ అధ్యక్షుడు టీవై శివయ్య, జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీ వి రమణ, జిల్లా వైసీపీ సెక్రటరీలు దేవనగర్ బాష, హరి, శివనాగిరెడ్డి, జిల్లా వైసీపీ క్రిస్టియన్ సెల్ రవికుమార్, జిల్లా వైసీపీ మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వార్డు వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ దండే బొజ్జయ్య, కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రమణ్యం, వార్డు వైసీపీ నాయకులు ఆర్ల వెంటస్వామి, దండే సుధాకర్, దండే శ్రీనివాసులు, మిద్దె సుబ్బయ్య, గుడిపాటి ప్రసాద్, చందు, రాజు, మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, నంద్యాల అసెంబ్లీ స్థాయి వైసీపీ నాయకులు, వార్డు ఇంచార్జీలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష నూట్లాడుతూ... శ్రీవేంకటేశ్వర స్వామి వారిని అడ్డుగా పెట్టుకొని దుష్ఠ రాజకీ యాలు చేస్తున్న చంద్ర బాబునాయుడు, పవన్ కళ్యాణ్ మరియు పచ్చ పార్టీనాయకులకు పాపభీతిలేదన్నారు. పచ్చముఠా చేసిన ఈ దుర్మార్గమైన చర్యలను హిందూ సమాజం క్షమించదని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

తిరుచుల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చిచెప్పడంతో ఇందంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర అని తేటతెల్లం అయ్యిందన్నారు. ఎన్నికల్లో గెలఅవడానికి ల్యాడ్ టైటిలింగ్ ఆక్ట్ అని, ఓడలో డ్రగ్స్ ఉన్నాయని, 30వేల మంది మహిళలు అదృశ్య అయ్యారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా అడ్డుకోవాలని కుట్రలు పన్ని అనేక అసత్యపు ఆరోణలు చేశారని వాటి లో ఒక్కటీ కూడా ఏ ఒక్కరూకూడా రుజువు చేయలేకపోయారన్నారు.  

చంద్రబాబునాయుడు గెలుపు కోసం అనేక అపద్దాలను మోస్తూ ఎవ్వరినైనా వెన్నుపోటుపొడవడానికి ముందుంటారని విమర్శించారు. తను పచ్చమీడియా అండతో పదే పదే అసత్యపు ప్రచారాలను చేస్తూ ప్రజలను నమ్మించేందుకు ప్రసారాలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఆందోళచెందేలా చేశారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వైవీసుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని ఎన్నుకుంటే వారు హిందువులు కాదు క్రిస్టియన్లని దుష్ ప్రాచారాని తెరలేపారన్నారు. 

పరకాయ ప్రవేశం చేసినట్లుగా రాత్రి పడుకొని పొద్దున్నే రంగులు వేసుకొని స్టేజి ముందుకు వచ్చి ఎర్రదుస్తులు వేసుకున్న పవన్ కళ్యాణ్ మాదిరి వీరు కాదని నిజమై భక్తి విశ్వాసాలు ఉన్నవారని పేర్కొన్నారు. తిరుమల వద్ద 2003 సంవత్సరంలో నక్సల్స్ చేసిన దాడి లో శ్రీవారి చలువ వల్ల ఆశీర్వాదాల చల్ల ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడని గుర్తు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ చేయించాలని కోరడం జరిగిదన్నారు. 

సిట్ జరిగిన విచారణలో క్లీన్ చీట్ ఇచ్చాని తెలిపారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు పాపపరిహారం చేసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాన్ చెబుతున్న సనాత ధర్మం ఎక్కడికి పోయిందని, ఎర్రదుస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చిత్త శుద్ధిలేని పవన్ కళ్యాణ్ ఏ ఒక్క దానిపై స్టాండ్ తీసుకున్నాడా అని ప్రశ్నించారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now