నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి: మండలం ఇందల్వాయి గ్రామంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాలుర కోచింగ్ క్యాంప్ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ తెలిపారు.
ఈ కోచింగ్ క్యాంప్‌ను జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షులు గడ్డం శ్రవణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లోకాని గంగామణి, ఉపసర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘ సెక్రెటరీ శ్యామ్, ఉపాధ్యక్షులు నరేందర్, కృష్ణ పాల్గొన్నారు.
ఈ క్యాంప్ మూడు రోజుల పాటు ఇందల్వాయిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, ఈ నెల 9, 10, 11 తేదీలలో ఆర్మూర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున పంపనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు తిరుపతి, గోపి, వార్డ్ మెంబర్ దాసు, గ్రామస్తులు సత్యనారాయణ, శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.
