జాతీయ ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర వీరయ్య చౌదరి


ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు: మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలోని APRJC బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో జాతీయ ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో జాతీయ ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈకార్యక్రమం ఎంతో విలువైనది ఘనమైనదని తెలిపారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ధైర్య సాహసాలతో ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపటానికి ప్రయత్నిస్తుంటే, దేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలపడానికి భవిష్యత్తు దర్శనీకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ డైనమిక్ లెజెండరీ లీడర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కృషి చేస్తున్నారని తెలిపారు. 

విద్యార్థులకు మంచి కంటి చూపు కలిగి ఉంటేనే విద్యాభ్యాసం చక్కగా జరుగుతుందని, సరైన దృష్టి లేనప్పుడు ఏకాగ్రత చదువుపై లగ్నం కాదని తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు చిన్న వయసులోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అనువైన కళ్ళజోళ్ళు అందించడం ద్వారా చదువుకి ఆటంకం లేకుండా విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందని అన్నారు. 

దీనిలో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనది ముఖ్యమైనది. కావున విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకుని డాక్టర్లు సూచించిన విధంగా పోషకాహారం తీసుకుంటూ సరైన కళ్ళజోడులను వాడుకుంటూ మంచిగా విద్యాభ్యాసం చేసి అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. 

మన ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ కుమార్ నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమ్మనబ్రోలు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, నాయకులు కార్యకర్తలు, మహిళలు, వీరయ్య చౌదరి అభిమానులు పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now