కాలువలోకి కారు బోల్తా.. పోలీసులు, స్థానికులు సహాయంతో ప్రయాణికులు సురక్షితం.


 అల్లవరం: కాలువలోకి కారు బోల్తా ఘటనలో ఐదుగురు కుటుంబ సభ్యులను అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్,ఐ., పోలీసు సిబ్బంది మరియు స్థానికులు కాపాడారు.

15-01-2024 వ తేదీ ఉదయం సుమారు 11 గంటల సమయంలో అల్లవరం మండలం కొమరగిరిపట్నం నుంచి అంతర్వేది వెళుతున్న AP 39 LJ 8998 నెంబరు గల Venue కార్ మరియు AP 03 AS 5471 Verna కార్లు ఒకదానిని మరొకటి ఓవర్టేక్ చేసే సమయంలో గుడ్డివాని చింత స్మశానం దగ్గర అదుపుతప్పి AP 39 LJ 8998 Venue కారు కాలువలో బోల్తాపడిపోయింది. అందులో మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తున్నారు.

అదే సమయంలో అటుగా వెళుతున్నటువంటి అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. G. హరీష్ కుమార్, వారి సిబ్బంది మరియు దగ్గరలో ఉన్న స్థానికులు వెంటనే అందులో వారిని బయటకు తీయడం జరిగింది. ఈ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి 1) ఆకుల సుధాకర్, 38 yes, వారి భార్య 2) ఆకుల సౌజన్య, 34yrs, కుమార్తె 3) ఆకుల లాస్య శ్రీ, 10yrs, 4) గుర్రాల దివ్య, 30yrs, 5) గుర్రాల శ్రీకాంత్, 32yrs ఉన్నారు.

సకాలంలో పోలీసులు మరియు స్థానికులు కలిసి వారందరిని రక్షించడంతో ప్రాణ ప్రమాదం తప్పింది.

దీనిపై అమలాపురం డిఎస్పి ఎం. అంబికా ప్రసాద్, అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వీరబాబు మరియు అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ను, సిబ్బందిని, ఈ రెస్క్యూలో పాల్గొన్నటువంటి స్థానికులందరినీ కూడా అభినందించడం జరిగింది.

Staff Repoter

Naresh T