దళిత నేత జూనియర్ ఇంజనీర్ బొడ్డు విక్టర్ బాబును పరామర్శించిన మంత్రి కారుమూరి


తణుకు: వై ఎస్ ఆర్ సి పి నేత, అల్ ఇండియా ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనార్టీ ఉద్యోగుల సంఘము మాజీ జిల్లా అధ్యక్షుడు, బి ఎస్ ఎన్ ఎల్, వి ఆర్ ఎస్, జూనియర్ ఇంజనీర్ ,, జాతీయ అవార్డు గ్రహీత బొడ్డు విక్టర్ బాబును ఆంద్రప్రదేశ్ రాష్ర్ట మంత్రి డాక్టర్ కారుమూరి వేంకట నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు. 

ఇటీవల అనారోగ్యంతో ఉన్న విక్టర్ బాబును తణుకు పాతావురు ఇరగవరం రోడ్ లోని 13 వార్డులో ఉన్న విక్టర్ బాబు స్వగృహంలో పరామర్శించి కుటుంబ సభ్యులకు విక్టర్ బాబు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను సులోచన విక్టర్, కుమార్తె సుష్మను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ హాస్పిటల్ లో జాయిన్ చేసి మంచి వైద్యం చేయిస్తానని హామి ఇచ్చారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ధైర్యంగా ఉండాలని కారుమూరి నాగేశ్వరరావుఅన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎ యం సి చైర్మన్ నత్త కృష్ణ వేణి, మాజీ ఎ యం సి చైర్మన్ చిట్టూరి వెంకట సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది వై ఎస్ ఆర్ సి పి తణుకు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పొట్ల సురేష్, నత్త గంగ వర్ధన రావు, యవజన నాయకుడు నత్త బాను, నత్త వెంకటేశ్వరరావు, దోలా సింహాద్రి నాయుడు తదితరులు విక్టర్ బాబును పరామర్శించారు.