బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం


ధర్మవరం పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో కేసు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.


శ్రీసత్యసాయి జిల్లా, ధర్మవరం, డిసెంబర్ 01: పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది. ధర్మవరంలో ఉండే ఓ జంట 14 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి ఓ ఆడ శిశువును తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ బాలిక వయస్సు 14 ఏళ్లు. ఈ క్రమంలో బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది కన్నేశారు. ఇద్దరూ బాలికపై తరచూ అత్యాచారం చేస్తూ ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు.

ఆదివారం బాలిక అనారోగ్యానికి గురికావడంతో పెంపుడు తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఐదు నెలలని తెలిపారు. తన సోదరుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భావించిన బాలిక పెంపుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ హేమంత్‌కుమార్‌ విచారించారు. పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారం చేశారని విచారణలో బాలిక తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరి పైనా పోక్సో కేసు నమోదుచేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now