నో బఫరింగ్.. నో సఫరింగ్.. 6జీ వస్తే ఏమి జరుగుతుందంటే..!


INTERNET NEWS: ఇంటర్నెట్ సేవల్లో సరికొత్త సంచలనాలకు ఈ దశాబ్ధంలోనే తెర లేచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2జీ, 3జీ, 4జీ ఇలా రకరకాల నెట్ వర్క్స్ అనంతరం 5జీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. చాలా ప్రాంతాల్లో ఇంకా 5జీ నెట్ వర్క్ సేవలే పూర్తిగా అందుబాటులోకి రాలేదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి అలా ఉంచితే... ఈ ప్రపంచ ఇంటర్నెట్ రూపురేఖల్ని ఒక్కసారి మార్చేసే 6జీ నెట్ వర్క్ సేవల గురించి చర్చ ఇప్పటికే మొదలైన వేళ.. దీనికి సంబంధించి పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. దీని వేగం గురించిన విషయాలు షాకింగ్ గా ఉన్నాయి! 


ఇంటర్నెట్ సేవల్లో సరికొత్త సంచలనాలకు ఈ దశాబ్ధంలోనే తెర లేచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఐదో తరం 5జీ నెట్ వర్క్ వాణిజ్యపరంగా చాలా తక్కువగా ఉందని.. కొన్ని ప్రదేశాలు మాత్రమే దాని అసమానమైన ప్రయోజనాలు పొందుతున్నాయని అంటున్న వేళ.. రాబోయే వైర్ లెస్ టెక్నాలజీపై పరిశోధనలు చేయడానికి ముందడుగులు వేశారు.. దీనిని మునుపటి సంప్రదాయాన్ని అనుసరించి 6జీ అని పిలుస్తున్నారు. 

దీని స్పీడు వేరే లెవెల్ లో ఉంటుందని.. అది చాలామందికి ఊహకు అందకపోవచ్చని.. ఈ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తే ఈ ప్రపంచంలోని మనిషి జీవనశైలి, ఆలోచనా విధాన అంతా మారిపోతుందని చెబుతున్నారు. దీనిపై తాజాగా స్పందించిన సిడ్నీ యూనివర్సిటీలోని వైర్ లెస్ కమ్యునికేషన్స్ నిపుణుడు మహ్యార్ శిర్వానిమోఘద్ధం... 6జీ నెట్ వర్క్ 1 టెరాబైట్/సెకన్ లేదా 8,000 గిగాబైట్ (జీబీ)/సెకన్ వేగాన్ని అందించగలదని అన్నారు. 

ఇంకా ఈజీగా అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే... ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లో ఒక బెస్ట్ క్వాలిటీ లో వీడియోను వీక్షించడానికి గంటకు సుమారు 56 జీబీ ల డేటా అవసరం అయితే... 6జీ నెట్ వర్క్ ని ఉపయోగిస్తే... మీరు ప్రతీ సెకనుకు 142 గంటల నెట్ ఫ్లిక్స్ హై క్వాలిటీ వీడియోను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నమాట. ఈ హైలెవెల్ డేటా ప్రాసెసింగ్ కెపాసిటీ 21వ శతాబ్ధంలో వినియోగదారులతో పాటు సంస్థల జీవితాలను మార్చేయబోతుందని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో పలు సంస్థలు, యూనివర్సిటీలు ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధించడంలో ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో 2019 జూన్ నెలలో 6జీ పరిశోధననూ ప్రారంభించినందున.. శాంసంగ్ కూడా పరిశోధన రేసులో పాల్గొనడానికి ఆసక్తిగా ఉంది. దక్షిణకొరియా టెలికాం సంస్థ అయిన ఎస్.కే. టెలికాం.. 6జీ మొబైల్ నెట్ వర్క్ టెక్నాలజీలో సంయుకంగా పరిశోధన, అభివృద్ధిని నిర్వహించడానికి ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో ఒప్పందాలపై సంతకం చేసింది. 

ఇదే సమయంలో... గూగుల్, యాపిల్ లు ఈ పరిశోధనపై ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ అమెరికా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 6జీని స్వీకరించడంలో ముందంజలో ఉండటానికి ప్రేరేపించబడిన నెక్స్ట్ జీ అలయన్స్ లో చేరాయని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే 2030 నాటికి ఈ 6జీ యుగంలోకి మనం వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గెట్ రెడీ..!!
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now