ANDRAPRADESH: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను మోసం చేయడంతోనే తాను వీడియోలు రిలీజ్ చేసినట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్లు చేయించి ...చివరకు అందరిని దూరం చేసి పెళ్లి చేసుకోను అని మోసం చేయడంతో వీడియోలను తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు బాధితురాలు తెలిపింది.
జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ బాధిత మహిళ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బలవంతంగా అనుభవించాడని తెలిపింది.
‘నేను, నా బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరాగా అయ్యిందని... బలవంతపు రిలేషన్ షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించారు అని ఆరోపించింది.గర్భం వస్తే తీయించుకోమని చెప్పగా అందుకు తాను నిరాకరిస్తే ఒక రోజు రాత్రి తన ఇంటికి వచ్చి తీవ్రంగా కొట్టారని తెలిపింది. తనను ఆయనతోపాటే ఉండాలంటూ చాలాసార్లు బెదిరించారని ఆరోపించింది. ఈ విషయం తన భక్తకు తెలియడంతో అతడు వచ్చి తన బాబును కూడా తీసుకెళ్లిపోయాడని చివరికి తాను ఒంటరిగా మిగిలిపోయానని ఆమె వాపోయింది.
తొలుత ఎమ్మెల్యేకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేశానని... ఆతర్వాత రెండు రోజులు ఫోన్‌లో మాట్లాడారని తెలిపింది. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగారని అందుకు ఒప్పుకోకపోవడంతో నీ ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ అన్నీ తన చేతిలోనే ఉంటాయని బెదిరించారని బాధితురాలు వాపోయింది. అంతేకాదు తనను ఇంటికి వచ్చి వాహనంలో తీసుకెళ్లేవారు అని బాధితురాలు మీడియా ఎదుట ఆరోపించింది.
ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు
తనను అబార్షన్ చేయించుకోమంటూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి పెంచాడంటూ బాధితురాలు వాపోయింది. అయితే తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. దాంతో తనను తీవ్రంగా కొట్టారని తప్పని పరిస్థితుల్లో అబార్షన్‌కు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మెుదటి అబార్షన్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫ్రెండ్ ద్వారా జరిగిందని అతడు అబార్షన్ అయ్యేందుకు టాబ్లెట్స్ ఇస్తే వేసుకున్నట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది. ఇకపోతే సెకండ్, థర్డ్ అబార్షన్లు సంజీవని హాస్పటల్‌లో చేయిపించారని బాధితురాలు తెలిపింది.
ఫిర్యాదు తీసుకోవడం లేదు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల గురించి పోలీసులను సైతం ఆశ్రయించానని అయితే అక్కడ తనకు న్యాయం జరగలేదు అని బాధితురాలు వాపోయింది. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదని వాపోయింది. ఇప్పటి వరకు కూడా తిరుపతి పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదని తెలిపింది.
రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే చర్యలు తీసుకోండి
మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బాధితురాలు రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఎమ్మెల్యే తల్లి ఆరోపించారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు సైతం చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఎమ్మెల్యేను రూ.25 కోట్లు ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నట్లు ఆడియోలు సైతం వైరల్ అవుతుంది.అయితే ఈ అంశంపై ఆమె స్పందించారు. తాను ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదు అని తెలిపింది. ఒకవేళ ఆడియో రికార్డులు ఉండి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు జరిపించాలని అందుకు తాను సిద్ధం అని బాధితురాలు తెలిపింది.
వీడియోలు నేనే రిలీజ్ చేశా..
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని...చివరికి ఒంటరిగా మిగిలిపోయానని బాధితురాలు వాపోయింది. అటు భర్తకు దూరమయ్యానని ఇటు పిల్లాడిని కూడా తన భర్త తీసుకెళ్లిపోయాడని ఆమె వాపోయింది. ఇలా తనను ఒంటరిని చేసి నమ్మించి మోసం చేసినందుకు వీడియోలను రిలీజ్ చేసినట్లు తెలిపింది.మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను వేధించిన వీడియలు, బెదిరిస్తున్న వీడియోలు వీటన్నింటికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని వాటిని కోర్టులు సబ్మిట్ చేస్తానని బాధితురాలు తెలిపింది.
