ఏలూరు జిల్లా, చాట్రాయి/నూజివీడు/విజయవాడ: నిన్న తాడేపల్లి ఎస్సార్ కన్వెన్షన్‌లో ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్లు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చౌటుపల్లి విక్రమ్ కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ గాదె రాంబాబు, శ్రీ నివాస్ తదితరులు హాజరయ్యారు.
అలాగే నూజివీడు అసెంబ్లీ చాట్రాయి నుండి ఏలూరు దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి, నూజివీడు నుండి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బోను అప్పారావు, ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ బడుగు శ్రీకాంత్, దళిత నాయకులు తిరివీది రాజేంద్రప్రసాద్ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ కట్నేని కృష్ణ ప్రసాద్‌ను శాలువా, బొకేతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, కమ్మ కార్పొరేషన్ అభివృద్ధికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని నాయకులు ఆకాంక్షించారు.
