మద్యం ధరలకు రెక్కలు- మద్యం ప్రియులు గగ్గోలు


మద్యం సిండికేట్లదే పెత్తనం 

 
ముమ్మిడివరం: మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చేయలేదు. కొత్త ధరలను ఎక్స్ఛేంజ్ అధికారులూ ప్రకటించలేదు. కానీ ముమ్మిడివరం మద్యం షాపుల సిండికేట్లు మద్యం ధరలను తమకు తామే పెంచేసుకున్నారు. శనివారం నుండి ముమ్మిడివరం మండలంలో షాపులలో అనధికారికంగా బాటిల్ కు అదనంగా పది రూపాయలు చొప్పున పెంచేశారు. 130 రూపాయలు ఉండే మధ్యరకం బ్రాందీ బాటిల్ పై పది రూపాయలు పెంచి 140 రూపాయలు, 190 ఎంఎల్ ఎంసీ బ్రాందీ బాటిల్ పై పది రూపాయలు పెంచి 200 రూపాయలు, 200 రూపాయలు ఉండే ఎంహెచ్ బ్రాందీ బాటిల్ పై పది రూపాయలు పెంచి అమ్ముతున్నారు. అలాగే 190 ఎమ్ఎల్ రాయల్ స్టాగ్, రాయల్ గ్రీన్ తదితర రకాల పైన పది రూపాయలు చెప్పున అదనంగా వసూళ్లు చేస్తున్నారు.

ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకు ఇవ్వాలని ఉద్దేశంతో రూ.99 చీప్ మద్యం సీసా ధరను కూడా వదలకుండా రూ.110లకు పెంచేశారు. ఎమ్మార్పీ కంటే ఈ మద్యం అధిక ధరలు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ప్రతిష్ట మంట గలుస్తోంది. ఆకస్మాత్తుగా సిండికేట్లు ధరలు పెంచేయడంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడు మద్యం సీసా ధర పెరిగింది. ఎందుకు పెరిగింది ఎవరు పెంచారు. అంటూ మద్యం ప్రియులు, షాపు సేల్స్ మాన్ల మధ్య వాగ్వివాదాలతో షాపుల వద్ద గొడవలు జరుగుతున్నాయి. 

ఈ పరిస్థితుల్లో షాపుల్లో సేల్స్ మెన్లు సమాధానం చెప్పలేక తలలు పెట్టుకుంటున్నారు. గత రెండు రోజుల నుంచి షాపులు వద్ద బహిరంగంగా మద్యంను అధిక ధరలకు అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం సేసాలను విక్రయించవలసి ఉన్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు అమ్ముతున్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు జిల్లా అధికారులను కోరుతున్నారు. ఈ అక్రమ ధరల అమ్మకాలపై ముమ్మిడివరం ఎక్సైజ్ ఎస్సై ముకురాంను వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, అధిక ధరల అమ్మే మద్యం షాపులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.



WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now