భార్య స్కూటీకి జీపీఎస్.. హోటల్ లో ఆ సీన్ చూసి భర్త గుండెలు పగిలాయి..


వివాహం, నమ్మకం, విశ్వాసం వంటి అంశాలపై చర్చలు మొదలైనప్పుడల్లా భావోద్వేగాల ఆధిపత్యం చెలాయిస్తాయి. ఫలితంగా విచక్షణ దూరమవుతుంది. ముఖ్యంగా భాగస్వామి ద్రోహాన్ని ఏ భర్త/భార్య తట్టుకోలేడు. ఈ విషయంలో సమాజం ఇప్పటికీ ఆవేశంగానే రియాక్ట్ అవుతోంది. 


వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం మాత్రమే కాదు.. అది ఒక పవిత్రమైన నమ్మకం. ఆ నమ్మకం ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఆ వేదన వర్ణనాతీతం. అయితే ఈ వేదనను సమాజం తూచే త్రాసులో మాత్రం తీవ్రమైన వివక్ష కనిపిస్తోంది. ఇటీవల అమృత్ సర్ లో ఒక భర్త తన భార్య ద్రోహాన్ని భరించలేక కెమెరా ముందు కన్నీరు పెట్టుకున్న దృశ్యం సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది.

15 ఏళ్ల బంధం.. 
ఒకే ఒక్క క్షణంలో ముక్కలు 15 ఏళ్ల వైవాహితక జీవితం, ఇద్దరు పిల్లలు, ఇంతటి సుధీర్ఘ ప్రయాణం తర్వాత తన భార్య మరొకరితో హోటల్ గదిలో ఉండటం చూసిన ఆ భర్త గుండె పగిలింది. భార్య స్కూటీకి జీపీఎస్ అమర్చి పట్టుకున్న ఆ దృశ్యం చూసిన ఎవరికైనా బాధ కలుగక మానదు. అయితే ఇక్కడ చర్చించాల్సిన విషయం ఆ వ్యక్తి వ్యక్తిగత బాధ గురించి మాత్రమే కాదు.. 

ఆ బాధపై సమాజం స్పందిస్తున్న తీరు గురించి కూడా ఆలోచించాలి. నమ్మక ద్రోహం విషయంలో మన సమాజం ఇప్పటికీ లింగ వివక్షతో కూడిన పాత ఆలోచననలనే అనుసరిస్తోంది. పురుషుడు తప్పు చేస్తే అతడిని సామాజికంగా బహిష్కరించడం, నైతికంగా కించపరచడం.. చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవడం వంటివి సహజంగానే జరుగుతాయి. మీడియా కూడా అతడిని ఒక విలన్ గా చిత్రీకరిస్తుంది.

ఇక ఇదే సమయంలో స్త్రీ తప్పు చేస్తే 
చాలా సందర్భాల్లో దీనిని ఆమె వ్యక్తిగత విషయం అని సరిపెట్టేస్తారు. లేదా ఆ తప్పు చేయడానికి భర్త వైపు నుంచి ఏదైనా కారణం ఉందేమో అని బాధితుడినే అనుమానించే పరిస్థితి ఉంటుంది. మగాడి కన్నీటికి విలువ లేదా? ‘మగాడు ఏడవకూడదు’ అనే మూసధోరణి మన సమాజంలో బలంగా నాటుకుపోయింది. ఒక పురుషుడు మానసిక వేధినకు గురైతే అతడిని ఓదార్చడం కంటే ‘అంతేలే’ అని తేలికగా తీసిపారేయడం లేదా నవ్వుల పాలు చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. నమ్మకద్రోహం వల్ల కలిగే బాధ లింగంతో సంబంధం లేనిది. మనుసు గాయపడితే కలిగే నొప్పులు అందరికీ సమానమే.

న్యాయం అందరికీ సమానంగా ఉండాలి ఒక మహిళ మోసపోతే ఎంతటి సానుభూతి లభిస్తుందో.. ఒక పురుషుడు మోసపోయినప్పుడు కూడా అంతే మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీడియా, సమాజం వైరల్ కంటెంట్ కోసం కాకుండా ఇలాంటి ఘటనల వెనుక ఉన్న మానసిక సమస్యలు, కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడంపై దృష్టి సారించాలి. న్యాయం, సానుభూతి అనేవి అందరికీ సమానంగా అందాలి. అప్పుడే నిజమైన సమానత్వానికి అర్థం ఉంటుంది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now