కృష్ణా జిల్లా, విజయవాడ: ఈ తరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డులకి ఉన్న ప్రాముఖ్యతను తెలియపరచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరానికి కి చెందిన "ఆర్టిజో" ఫైన్ ఆర్ట్స్ స్టూడియో మరియు"స్ఫూర్తి" క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న "గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్" నిర్వహిస్తున్నట్లు ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కాంటెస్ట్ కి సంబంధించిన పోస్టర్ ని ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్క్రీన్ టైం ని తగ్గించేందుకు చిన్నారులకు ఇలాంటి కాంటెస్ట్ లు అవసరమన్నారు.
పుట్టినరోజు, పండుగలు, నూతన సంవత్సరం ఇలా పలు అంశాలపై ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టెక్నిక్ లు వాడి అబ్బురపరిచే గ్రీటింగ్ కార్డులు చిన్నారులు రూపొందించగలరని... ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతలతో ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
"పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పసుమర్తి అమర దీప్తి, ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు"
