INDIA NEWS: మహిళలకు రక్షణ లేదు అంటూ ప్రతి రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా మహిళలు వర్క్ ప్లేస్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆఫీస్‌ల్లో బాస్‌లు లేడీస్‌ను లైంగిక వాంఛ తీర్చమని కోరుతున్న సందర్భాలు కూడా ఉంటాయి.
అన్ని రంగాల్లోనూ ఆడవారి విషయంలో కొందరు మగాళ్లు లైంగిక వాంఛను కనబర్చుతున్నారని, దాంతో ఆడవారు చాలా చోట్ల కనీసం వర్క్ చేయలేక పోతున్నారు అంటూ మహిళా సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వర్క్ ప్లేస్‌లో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మగవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం గతంలో కూడా బయటకు వచ్చింది. తాజాగా మరో ఘటన ఈ విషయమై చర్చకు తెరలేపింది.
ముంబై వ్యక్తిపై లైంగిక వేధింపులు
ముంబైలోని గోరేగావ్‌కి చెందిన 29 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షాకింగ్ విషయాన్ని షేర్ చేశాడు. ఆయన సోషల్ మీడియాలో... తన ఆఫీస్ లో లేడీ బాస్ వర్క్ రివ్యూ పేరుతో పదే పదే తన రూంకి పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తోంది. మాట్లాడే సమయంలో ఆమె అసభ్యంగా తాకడం ఇబ్బందిని కలిగించింది. ఆమె నన్ను చేతులతో తాకుతూ మాట్లాడింది. అంతే కాకుండా ఆమె దగ్గరగా కూర్చుని అవసరం లేకున్నా కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. ఆమెకు వివాహం అయ్యి పిల్లలు ఉన్నారు. ఆమె వయసులో నా కంటే పెద్ద వారే. అయినా కూడా నా పట్ల ఆమె లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా వ్యవహరిస్తుంది. ఆమె తీరు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆమె పదే పదే అలా చేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నట్లుగా అతడు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియాలో అతడి పోస్ట్ వైరల్..
అతడి పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. అతడి పోస్ట్ కి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దాన్ని గురించి కామెడీ చేస్తే, మరికొందరు మాత్రం ఇది సీరియస్ విషయం అన్నట్లుగా అతడికి మద్దతు తెలిపారు. మహిళలు అలాంటి పనులు చేస్తున్నారు అంటే నమ్మలేక పోతున్నాం అని, ఆఫీస్‌ల్లో ఒకప్పుడు ఆడవారికి రక్షణ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు లేడీ బాస్‌ల కారణంగా మగవారికి కూడా రక్షణ లేదా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి అతడి గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆఫీస్‌ల్లో మగవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఫిర్యాదు చేయడం కోసం ప్రత్యకమైన చట్టాలు అంటూ ఏమీ లేవు. కనుక అతడు ఆఫీస్ మారాల్సిన పరిస్థితి ఉందని, లేదంటే అక్కడే లైంగిక వేధింపులకు గురి అవుతూ తన పని తాను చేసుకోవాల్సి ఉంటుంది అని కొందరు అంటున్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే
ఈ విషయమై సామాజిక కార్యకర్త అయిన దీపికా నారాయణ్ భరద్వాజ్ స్పందిస్తూ పురుషులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి కోసం ఒక స్పష్టమైన చట్టం అంటూ లేదని పేర్కొంది. కానీ స్త్రీ పురుష బేధం లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగికి సమానమైన చట్టం వర్తించాల్సిన అవసరం ఉందని కొందరు భావిస్తున్నారు. ఎలాగైతే ఆడవారి పట్ల ఆఫీస్‌ల్లో లైంగిక వేదింపులు జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందో, అలాగే మగవారి విషయంలోనూ కోర్ట్‌లు హక్కులు కల్పిస్తూ లైంగిక వేదింపులకు పాల్పడే లేడీ బాస్‌లను, లేడీ ఎంప్లాయిస్‌ను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చేసినా కూడా మగవారిదే తప్పు, మగవారు ఎక్కువగా లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు అనే విమర్శలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.
