షాకింగ్.. ఈ మద్యం తాగితే గుండె పోటు.. మందుబాబులకు హెచ్చరిక!


హోమియోపతి మందులను కూడా వదలలేదు.. దాంతో కూడా మద్యం కల్తి..! ఎక్కడో తెలుసా.. మోసంలో రకరకాల మోసాలు ఉంటాయి. మాయల్లో భయంకరమైన మాయలు ఉంటాయి. అలాంటిదే ఈ మాయ కూడా. విశాఖలో హోమియోపతి మందులు కూడా వదలకుండా దాంతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. కీలకమైన ఈ విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. అలాగే ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయిన ఆ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నారు. 


హోమియోపతి మెడిసిన్ లో వాడే చాలా దారుణమైన బెల్లడినో ద్రావకం వాడి.. మద్యం తయారు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో కల్తీ చేస్తున్న ఈ బిగ్ రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే కొన్ని మద్యం సీసాలు సీజ్ చేసిన పోలీస్ అధికారులు తర్వాత మరిన్నిటి కోసం వెదుకుతోంది.

బరంపురం ప్రాంతానికి చెందిన సుశాంత్ పాత్రో పై గతంలో పలు ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. ఎన్ఫోర్స్‌మెంట్ వర్గాల మానిటరింగ్ నిఘాకు తప్పించుకుని తిరుగుతుండడంతో అనుమానం వచ్చింది. దీంతో పెందుర్తి ప్రాంతంలో ఉన్న అతని ఇంటికి వెళ్లారు. అక్కడ సోదాలు చేస్తే, 8 మద్యం బాటిళ్లు లభించాయి. ఇంట్లో సుశాంత్ భార్య శిరీషను పట్టుకుని ఎస్ఈబి అధికారులు విచారించారు. 

కీలక సమాచారం బయటపడింది. వాళ్ళిద్దరే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు.. అది కూడా ప్రమాదకర కెమికల్స్‌తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నే పెట్టినట్టు గుర్తించారు అధికారులు. విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఓ మారుమూల ప్రాంతంలో ఒక కుటీర పరిశ్రమనే పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసేస్తున్నారు.