ANDRAPRADESH, AMARAVATHI: ఏపీ ఫైబర్ నెట్ కు పునఃవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. By: BCN TV NEWS గత ప్రభుత్వంలో కనెక్షన్లు తగ్గి, ఖర్చులు పెరిగి దివాళా అంచుకు చేరుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఫైబర్ నెట్ ను సంస్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ కు పునఃవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో కనెక్షన్లు తగ్గి, ఖర్చులు పెరిగి దివాళా అంచుకు చేరుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఫైబర్ నెట్ ను సంస్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
చంద్రబాబు 3.0 సర్కారులో ప్రజలకు చౌక ధరకు ఫోన్, ఇంటర్ నెట్, టీవీ సదుపాయాలు కల్పించాలని ఏపీ ఫైబర్ నెట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయతే గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని భావించిన ప్రస్తుత ప్రభుత్వం సంస్థను సంస్కరించాలని నిర్ణయించుకుంది. వచ్చే నాలుగేళ్లలో కనెక్షన్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి తీవ్ర చర్చకు కారణమైన ఏపీ ఫైబర్ నెట్ ను మళ్లీ పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని చెబుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో 50 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేసేలా టార్గెట్ పెట్టుకున్న ఫైబర్ నెట్ యాజమాన్యం నెట్ వర్కు లైన్ల నిర్వహణకు ఈపీసీ విధానంలో టెండర్లు ఆహ్వానించింది. దీనికి సుమారు రూ.1900 కోట్లు ఖర్చుకానుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఆ మేరకు నిధుల కోసం రూ.1900 కోట్లతో ప్రతిపాదనలు చేస్తోంది. ఈ మొత్తాన్ని కేంద్రం నుంచి సమకూర్చుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చించారని చెబుతున్నారు. ఇప్పటికే నిధుల వేట కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలను కలవడంతో వారు సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది.
గత ప్రభుత్వంలో సంస్థను అన్నివిధాలుగా నిర్వీర్యం చేయడంతో కనెక్షన్ల సంఖ్య 9 లక్షల నుంచి నాలుగున్నర లక్షలకు పడిపోయిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కి తొంభైశాతం కనెక్లషన్లు పెరిగేలా పథకం రూపొందించాలని సూచిస్తున్నారు. భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్ (బీబీఎన్ఎల్)రెండు దశల్లో కలిపి సుమారు 81 వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సంస్థ పరిధిలో ఉంది. ప్రస్తుతం వాటి నిర్వహణను సంస్థ స్వయంగా పరిష్కరిస్తోంది. ఇదే సమయంలో బయట ఉన్న లైన్ల నిర్వహణ, వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపడం భారంగా ఉంటోందని అంటున్నారు. ఈ ద్రుష్ట్యా గ్రామాల వరకు ఉన్న ప్రధాన అప్టికల్ కేబుల్ నిర్వహణను ఈపీసీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు సంస్థను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వాడేసిన డబ్బులను తిరిగి సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో రూ.450 కోట్లు ఫైబర్ నెట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా కార్పొరేషన్ ను ప్రక్షాళించాలనే ప్లాన్ లో భాగంగా సుమారు 908 మంది సిబ్బందిని అధికారులు తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే సరిచేయడం కుదరడం లేదని అంటున్నారు. సిబ్బంది తొలగింపుతో చాలా రోజుల నుంచి ప్రసారాల్లో సాంకేతిక లోపం తలెత్తుతుండటం వల్ల గత రెండు వారాల్లో 25 వేల మంది వినియోగదారులు ఫైబర్ నెట్ ను తీసివేసినట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థపైనే ఆధారపడిన 6500 కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు.