వంశీపై గనుల శాఖ తాజా కేసు సరే.. అతడి ఫ్యూచర్ ఏంటి?


ANDRAPRADESH, AMARAVATHI: వంశీ అండ్ కో దెబ్బకు భారీగా ప్రక్రతి విధ్వంసం జరిగిందని పేర్కొంటూ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇచ్చారు. BY: BCN TV NEWS ఒకటి తర్వాత ఒకటిగా నమోదవుతున్న కేసులు. గడిచిన కొద్దికాలంగా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి బెయిల్ వస్తుందన్న ఆశలు.. జైలు నుంచి విడుదల అవుతారన్న నమ్మకం అంతకంతకూ తగ్గుతోంది. తాజాగా గనుల శాఖ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో సిట్ నమోదు చేసిన కేసుతో ఒక అంశం అర్థమైందన్న మాట బలంగా వినిపిస్తోంది. కనుచూపు మేరలో వంశీకి బెయిల్ దొరికేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


వంశీ అండ్ కో దెబ్బకు భారీగా ప్రక్రతి విధ్వంసం జరిగిందని పేర్కొంటూ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆయనపైనా.. ఆయన అనుచరులపైనా కేసు నమోదు చేశారు. గడిచిన కొంతకాలంగా జైల్లో ఉన్న వల్లభనేని వంశీకి ఇదో ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ.. ఎంత త్వరగా అయితే అంత త్వరగా జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే..ఒకటి తర్వాత ఒకటిగా నమోదు అవుతున్న కేసుల తీరు ఆయనకు జైలు జీవితాన్ని కొనసాగించేలా చేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరే ఈ రోజు పరిస్థితులకు కారణమన్న మాట బలంగా వినిపిస్తోంది. గన్నవరం మండలంలోని వెదురుపావులూరు.. కొండపావులూరు.. గోపవరకుగూడెంలో 300 ఎకరాలకు పైగా విస్తరించిన కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేసి.. అక్రమ తవ్వకాలతో నేలమట్టం చేశారని.. సుమారు 500 ఎకరాల్లోని సూరపల్లి తోకతిప్పలను తవ్వేసి కోట్లాది రూపాయిలు స్వాహా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఇంతకాలం బయటకు రాకుండా తనకున్న పలుకుబడితో మేనేజ్ చేసిన వంశీకి.. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖకు చెందిన అధికారులు కూడా తన వైపు కన్నెత్తి చూసేందుకు సైతం భయపడేలా చేసుకున్నట్లు చెబుతారు. ఇప్పుడు మాత్రం అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అద్భుతం జరిగితే తప్పించి.. ఇప్పట్లో వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే ఉండదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.