అమరావతిలోని ఆలయాల సందర్శన కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ


ANDHRAPRADESH:ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు.

ఏసీ వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. సీటింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతోన్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు.

ఏసీ వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. సీటింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతోన్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింత ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్యాకేజీ పేరు- సప్త దర్శిని. ఈ ప్యాకేజీ కింద రాజధాని అమరావతి పరిధిలోని ఏడు ప్రఖ్యాత ఆలయాలను ఒక్కరోజులో చూసేయవచ్చు. ఉండవల్లి బౌద్ధారామాలు సైతం ఇందులో ఉంది.

మంగళగిరిలో వెలిసిన పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం, పెదకాకాని లోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దేవస్థానం, వెంకటపాలెంలో గల వెంకటేశ్వర స్వామివారి గుడి, పెనుమాకలోని మహా దివ్యక్షేత్రం, ఉండవల్లి బౌద్ధారామాలను సందర్శించవచ్చు.

ఈ ప్యాకేజీ టూర్ కోసం నాన్ ఏసీ పుష్ బ్యాక్ సూపర్ లగ్జీరీ బస్సున వినియోగించనుంది ఆర్టీసీ. ఈ నెల 20వ తేదీన తెల్లవారు జామున 5:30 గంటలకు సర్వీస్ నంబర్ 95290 బస్సు విజయవాడ ఆటోనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరుతుంది. 6 గంటలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కు చేరుకుంటుంది.

ఆయా ఆలయాలను సందర్శించిన అనంతరం సాయంత్రం 6 గంటలకు మళ్లీ ఈ బస్సు విజయవాడకు చేరుకుంటుంది. ప్యాకేజీ టికెట్ 600 రూపాయలుగా నిర్ధారించారు. apsrtc.in వెబ్ సైట్ లో కూడా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now