ANDRAPRADESH, ELURU: ఏలూరు జిల్లా రాజకీయవర్గాల్లో తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పదవి ఆసక్తిగా మారింది. జిల్లాలో అధ్యక్ష పదవి ఎంపికపై నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు ఇప్పటికే ఆశావాహుల పేర్లు అధిష్టానం ముందుంచారు. త్రిసభ్య కమిటీకి ఎంతమంది నేతలు తమ దరఖాస్తులు ఇచ్చినా... రేసులో మాత్రం ప్రధానంగా కొందరు పేర్లే ఉన్నాయి.
![]() |
| గన్ని వీరాంజనేయులు |
ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆఫ్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే సమర్థవంతంగా పార్టీని నడిపించారు. సీటు త్యాగంతో పాటు ప్రతిపక్షంలో పడిన కష్టాన్ని గుర్తించి ఆయనకు డీసీసీబీ ఛైర్మన్తో పాటు ఆఫ్కాబ్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇటు ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గాను ఉన్నారు. ఆఫ్కాబ్ చైర్మన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మక పదవి కావడంతో మరోసారి ఆయననే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారా.. మార్పులుంటాయా ? అన్నది చూడాలి.
![]() |
| ఘంటా మురళీ రామకృష్ణ |
మరోసారి జిల్లా పగ్గాలు కమ్మ సామాజిక వర్గానికే కంటిన్యూ చేయాలనుకుంటే గన్నిని కాదనుకుంటే చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ రేసులో ప్రథమంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా, ఇటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు ఎస్సీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అటు మంత్రి సారథి, జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ప్లస్ కానుంది. మురళీ నామినేటెడ్ రేసులో ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేదు. ఈ క్రమంలోనూ ఘంటా మురళీ పేరు ముందు వరుసలోనే ఉంది.
![]() |
| బడేటి చంటి |
గోదావరి జిల్లాల సామాజిక సమీకరణలను అధిష్టానం దృష్టిలో ఉంచుకుంటే కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఒక్కరే రేసులో ఉన్నారు. జిల్లా కేంద్రం నుంచి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అవ్వడంతో పాటు వివాదాలకు దూరంగా... అధిష్టానం అంచనాలకు మించి పనిచేస్తుండడం కలిసి రానుంది.
![]() |
| శీలం వెంకటేశ్వరరావు |
బీసీ కోటాలో పోలవరం నియోజకవర్గం టి.నరసాపురం మండలానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎన్నో పదవులు అధిరోహించిన ఆయన పార్టీ కష్టకాలంలలో ఉన్న ప్రతిసారి పార్టీ కోసం నిలబడ్డారు. శీలం యాదవ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నారు. అయితే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, మంత్రి కొలుసు పార్థసారథితో పాటు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ తో పాటు పార్లమెంటు పరిధిలో పలు పదవులు ఈ వర్గానికి కేటాయించారు. శీలంకు పగ్గాల విషయంలో ఈ సమీకరణలు ప్రభావం చూపుతాయా? అన్నది చూడాలి.
![]() |
| జయవరపు శ్రీరామ్మూర్తి |
ఇది ఇలా ఉంటే.. ఇదే మండలం నుంచి ఆర్యవైశ్యులలో పేరు ప్రఖ్యాతులు పొంది ఎన్నో సేవలు చేసిన పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయవరపు శ్రీరామ్మూర్తి ఈ రేసులో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనకి టిక్కెట్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం గెలుపు కోసం శ్రమించిన వ్యక్తి. ఆర్యవైశ్య కులంలో ఒక అవకాశం కల్పించాలని ఆర్యవైశ్యులు, ఆయన కేడర్ వర్గం కోరుతున్నారు. శాంతియుత శుభావం కల్గి అని వర్గాలు వారిని కలుపుకుంటూ ముందుకు సాగే వ్యక్తి శ్రీరామ్మూర్తి. ఈసారి ఈ పదవి ఈయనకు వరిస్తుందా వేచి చూడాలి..
![]() |
| దాసరి శ్యామచంద్ర శేషు |
ఇక చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంకు చెందిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు కూడా బీసీ - గౌడ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడి నుంచి చిన్న వయస్సులోనే అధికార ప్రతినిధి. అయిన శేషు యువకుడు కావడం ఫ్లస్ కానుంది. ఎంటైర్ పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న గౌడ సామాజిక వర్గానికి ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో శేషు పేరు బలంగా రేసులోకి వచ్చింది. ఎమ్మెల్యే చింతమనేని లాంటి మూడుసార్లు గెలిచిన సీనియర్ ఉన్నా ఆయనకు ఈ పదవి నాకు వద్దని ఓపెన్ గానే చెప్పేశారు.
ఇకపై నేతలతో పాటు మరికొందరు కూడా దరఖాస్తులు పెట్టుకున్నా... ప్రధానంగా పై ఆరుగురి పేర్ల మీదే అధిష్టానం దగ్గర ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉండడంతో ఎవరికి ఈ ఛాన్స్ వచ్చినా సమర్థవంతంగా పనిచేస్తే వారి పొలిటికల్ గ్రాఫ్ మరింత పైకి వెళుతుందనడంలో సందేహం లేదు.






