సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం


ANDRAPRADESH, AMARAVATHI: బుధవారం కూడా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అరికట్టెందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన నుంచి సోషల్ మీడియా పోస్టింగులపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు సర్కారు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేయించింది. 


అయినప్పటికీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆగటం లేదని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫేక్ ప్రచారాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించారు. గురువారం నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి మండలి సోషల్ మీడియా పోస్టింగులతో దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు పకడ్బందీ చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. 

సోషల్ మీడియా చట్టం రూపకల్పన, అవసరమైన విధి విధానాలు, సూచనలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇందులో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అనిత, పార్థసారథి ఉంటారు. తప్పుడు ప్రచారం అరికట్టడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంపై మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. అధికారంలోకి వచ్చిన నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రధానంగా అమరావతి, పోలవరం, వర్షాలు, రైతుల సమస్యలపై తప్పుదారి పట్టించేలా ప్రచారం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో యూరియా కొరత లేకపోయినా, ఉందని ప్రచారం చేయడం, దివ్యాంగుల పింఛన్ల తొలగిస్తున్నారంటూ లబ్దిదారులు కాని వారు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుండటాన్ని ఉపేక్షించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ట్రంప్ ఇందుకే అనేది బుధవారం కూడా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ప్రజలు, రైతులను తప్పుదారి పట్టించేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. తప్పుడు పోస్టుల పెట్టేవారి భరతం పడతామని హెచ్చరించారు. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి ఈ విషయంపై చాలా సీరియస్ గానే వ్యవహరిస్తూ వచ్చింది. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలను పదుల సంఖ్యలో అరెస్టు చేసింది. అయితే వారంతా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసులు ఎదుర్కొన్నారు. 

కానీ, ఇప్పటి వరకు తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారంపై ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రస్తుత చట్టంలో ఆ వెసులుబాటు కూడా లేదని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అమరావతి మునిగిపోయిందని ఓ ప్రభుత్వ ఉద్యోగి పోస్టింగులు పెడితే షోకాజు నోటీసు జారీ చేశారే కానీ, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని అంటున్నారు. అదేవిధంగా అమరావతి మునిగిపోయిందన్న ప్రచారంపై అరెస్టు చేసి జైలుకు పంపే కేసులు నమోదు కాలేదని గుర్తు చేస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో తాము ఏ ప్రచారం చేసినా, కేసులు నమోదు చేస్తారే కానీ జైలుకు పంపడం సాధ్యం కాదన్న భావనతో ఫేక్ పోస్టులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తప్పుడు ప్రచారం చేసిన వారు జీవితంలో ఇంకోసారి అలాంటి తప్పు చేయడానికి భయపడేలా కొత్త చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు. మంత్రివర్గంలో ఈ విషయంపై కూలంకుషంగా చర్చించిన తర్వాత చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకురావడంతోపాటు మంత్రివర్గ ఉప సంఘాన్ని వెనువెంటనే నియమించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు సోషల్ మీడియా కట్టడికి చట్టం చేస్తే దేశంలో ఈ తరహా చట్టం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కనుందని అంటున్నారు. ఇదే రకమైన సమస్య ఎదుర్కొంటున్న మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రానికి ఏపీ ఆదర్శంగా నిలవనుందని కూడా చెబుతున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now