అబ్బే.. ఆ జోడీ ఇంకా ఫిక్స్ కాలే బాసూ!


 తాజాగా సమాచారం ప్రకారం.. వెంకటేష్, త్రిష కాంబో ఇంకా సెట్టవ్వలేదట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్మాతలు.. హీరోయిన్ కోసం ఇంకా ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపలేదట. సీనియర్ హీరోయిన్ త్రిష.. నాలుగు పదుల వయసులో కూడా ఇంకా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గతేడాది పొన్నియన్ సెల్వన్, లియా సినిమాల్లో యాక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకుంది. 


ఇక చేతి నిండా ప్రాజెక్టులతో 2024లో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తోంది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీలో నటిస్తోంది త్రిష. దాంతోపాటు మలయాళంలో మరో సినిమా కూడా చేస్తోంది. కోలీవుడ్ లో అజిత్, కమల్ హాసన్ మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరితో నటించనుంది త్రిష. ఇక టాలీవుడ్ ను అప్పట్లో ఒక ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అతడు వంటి పలు సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

ఆ తర్వాత వరుస ఛాన్సులు దక్కించుకుని సీనియర్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవితో నటిస్తోంది. విశ్వంభర మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అయితే త్రిష.. వెంకటేష్ నెక్స్ట్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇటీవల వార్తలు వచ్చాయి. వెంకీ మామ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కు ఆమె సైన్ చేసినట్లు టాక్ వినిపించింది. తాజాగా సమాచారం ప్రకారం.. వెంకటేష్, త్రిష కాంబో ఇంకా సెట్టవ్వలేదట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్మాతలు.. హీరోయిన్ కోసం ఇంకా ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపలేదట. ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కాగా, వీరిద్దరు కలిసి గతంలో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశా, బాడీ గార్డ్ సినిమాలు చేశారు. 

వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పొంగల్ ను టార్గెట్ గా పెట్టుకుని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందట. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.