దేవర పాట.. ఏదో తేడాగా ఉందే..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.


సోలోగా పాన్ ఇండియా లెవల్ లో ఎన్టీఆర్ మార్కెట్ ఎంత ఉందనేది దేవర మూవీ డిసైడ్ చేయనుంది. దీంతో ఈ సినిమాపైన తారక్ చాలా ఎఫర్ట్ పెట్టారు. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా ఈ మూవీ కథాంశం ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ ఉంది. ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ కూడా దేవర మూవీ కంటెంట్ ఎలా ఉండబోతోందనేది రివీల్ చేశాయి. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ టైటిల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

దీనికి పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హీరో క్యారెక్టరైజేషన్స్ ని అద్భుతంగా ఈ సాంగ్ లో ఎలివేట్ చేశారు. అనిరుద్ వెస్ట్రన్ టచ్ లో సాంగ్ ని అందరికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఇదిలా ఉంటే దేవర నుంచి సెకండ్ సింగిల్ ని ఆగష్టు 5న రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సెకండ్ సింగిల్ ఎనౌన్సమెంట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో తారక్, జాన్వీకపూర్ రొమాంటిక్ స్టిల్ ని రిప్రజెంట్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరి మధ్య మంచి డ్యూయెట్ గా ఈ సాంగ్ ఉండబోతోందని పోస్టర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ పోస్టర్ లో తారక్ చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. జాన్వీ కపూర్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది. వారి బ్యాగ్రౌండ్ లో ఫారెస్ట్ ని కరెక్ట్ గా డిజైన్ చేయలేదని, ఏదో తేడాగా ఉందే అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లెగ్స్ కనిపించడం లేదంటూ మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సీజీలో చేసిన బ్యాగ్రౌండ్ అంత ఎఫెక్టివ్ గా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే డ్యూయెట్ కాబట్టి కచ్చితంగా బెస్ట్ మెలోడీ సాంగ్ ని ప్రేక్షకులు వినాలని అనుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సాంగ్ ని ఎలా రెడీ చేసాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సీజీ వర్క్ విషయంలో టెక్నీకల్ టీమ్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. సాంగ్ బాగుంటే పోస్టర్ లో కనిపించే మైనస్ లని ప్రేక్షకులు పట్టించుకోరు. ఎన్టీఆర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ సాంగ్ లో బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సెకండ్ సాంగ్ విజువల్స్ తో ట్రోల్స్ చేసేవారికి స్ట్రాంగ్ గా సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.