వైసీపీ సీనియర్‌ నేత నెత్తిన మరో పిడుగు!


మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లిన కేసులో జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఐడీ అటాచ్‌మెంట్‌ లో ఉన్న భూమిని తప్పుడు పద్ధతుల్లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, దాన్ని తిరిగి వేరేవారికి అమ్మడం వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ కుమారుడు జోగి రాజీవ్‌ ను కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది. దీంతో జోగి రాజీవ్‌ ను జైలుకు తరలించారు.


మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లిన కేసులో జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నాడు పదుల సంఖ్యలో కార్ల కాన్వాయ్‌ తో జోగి రమేశ్‌ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జోగి రమేశ్‌ పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. టీడీపీ కార్యకర్తలు, నేతలపైనే కేసు పెట్టారు.

ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జోగి రమేశ్‌ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఇప్పటికే ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆగస్టు 20 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాలని జోగి రమేశ్‌ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌ తాజాగా మంగళగిరిలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. తాను చంద్రబాబు ఇంటిపైకి దాడి చేయడానికి వెళ్లలేదని.. నిరసన తెలపడానికి మాత్రమే వెళ్లానంటూ జోగి రమేశ్‌ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తనపై చంద్రబాబు కక్ష సాధింపునకు దిగారని జోగి రమేశ్‌ ఆరోపించారు. ఇప్పటికే తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని.. ప్రతి పశ్నకు సమాధానం చెబుతానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు, లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు ఎదురుచూస్తుంటే ఆ పని వదిలేసి కేసుల పేరుతో తమలాంటి వారిని వేధిస్తున్నారని విమర్శించారు. 

తద్వారా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులకు భయపడనని తెలిపారు. రాష్ట్ర ప్రజలు అన్నింటిని గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం తన కుమారుడు రాజీవ్‌ ను అరెస్టు చేసినప్పుడు కూడా జోగి రమేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కులం పేరును చెప్పుకున్న ఆయన బడుగు బలహీనవర్గాలు ఎదుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆ రోజు చంద్రబాబు ఇంటిపైకి తాను దాడికి వెళ్లలేదని.. వైఎస్‌ జగన్‌ ను టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తిడితే తట్టుకోలేక చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పెద్ద మనిషిగా న్యాయం చేయాలని కోరేందుకు వెళ్లానని జోగి వివరణ ఇచ్చారు.