మత్యకారుల సంక్షేమ సంఘం సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం


డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మత్యకారుల సమస్యలపై ఢిల్లీలోని పుదుచ్చేరి ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి క్రిష్ణారావు అద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ లను ఉభయగోదావరి జిల్లాల మత్యకారుల సంక్షేమ సంఘం కలసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.


ఈ వినతి పత్రంలో ONGC, గెయిల్ మొదలగు ఆయిల్ కంపెనీలు సముద్రంలో ఆయిల్ తీయడం వలన సముద్రంలో మత్యసంపదకు తీవ్ర నష్టం సంభవిస్తుందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, వివిధ ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో 1% లాభాలను మత్యకార సంక్షేమ సంఘంకి కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మత్యకార సంక్షేమ సంఘంకి ఇప్పటి వరకు ప్రభుత్వం బకాయి పడ్డ బాకీలను వెంటనే చెల్లించాలని, అంతరించిపోతున్న మడ అడవులను సంరక్షించి, పెంచి పోషించాలని, పారిశ్రామిక వ్యర్థాలు మరియు వ్యవసాయ ప్రవాహాల నుండి వచ్చే కాలుష్యం తీరప్రాంత జలాల్లోని చేపల జనాభాను గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఇది మత్స్యకారులకు తగ్గిన క్యాచ్‌లకు దారితీస్తుందని, మౌలిక సదుపాయాల కొరత వల్ల తగినంత నిల్వ సౌకర్యాలు, మంచు మొక్కలు మరియు సరైన ల్యాండింగ్ సైట్లు చేపల సంరక్షణ మరియు సకాలంలో అమ్మకానికి ఆటంకం కలిగించడం వలన మత్యకారుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందిని దీనికి తగిన పరిష్కరం ప్రభుత్వపరంగా చూపాలని, మత్స్యకారులు తక్కువ చేపలు పట్టే సమయంలో మరియు చేపల వేట నిషేధం సమయంలో పని కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వస్తుందని కనుక ప్రభుత్వం మత్య వేట నిషేధ సమయంలో మత్యకారులకు ఇచ్చే భృతిని రూ 20,000/- పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ లకు మత్యకారుల సంక్షేమ సంఘం సమస్యలపై వినతిపత్రం సమర్పించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో గనులు & భూగర్భ శాస్త్ర శాఖ రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవింద్ర, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, మత్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రీ చిట్టిబాబు, నాగిడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.