కే గంగవరం మండలంలో యువతను కలిసి ప్రచారం..
మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థి పేరాబత్తులకు వేయాలని విజ్ఞప్తి..
కే గంగవరం: ఉభయగోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి మద్దత్తుగా ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం సీనియర్ నాయకులు మోర్త దొరబాబు ఎన్నికల బ్యాలెట్ నమూనా పత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా దొరబాబు పలువురు యువతతో కలిసి కే గంగవరం మండలం దంగేరు శివల కుడుపూరు గ్రామంలో పట్టభద్రులను నేరుగాకలిసి బ్యాలెట్ నమూనాను అందజేసి ఓటర్లను తమ కూటమి అభ్యర్థి రాజశేఖర్ విజయానికి తోడ్పడాలని ఓటర్లకు ఆయా చోట్ల విజ్ఞప్తి చేశారు.
అలాగే పట్టభద్రులు ప్రతీ ఒక్కరూ పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ కూటమి అభ్యర్ధి విజయానికి సహకరించాలని ఆయన ఆయా గ్రామంలో గత రెండు రోజులు నుండి విస్తృతంగా ప్రచారాన్ని పలువురు యువతతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈకార్యక్రమంలో ఆయనతోపాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.