విమ‌ర్శించేవారి విజ్ఞ‌త ఇదేనా.. ఏపీలో యోగా ర‌గ‌డ‌..


శనివారం ఉదయం విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

VISAKHAPATNAM:శనివారం ఉదయం విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి స్పందన బాగానే వచ్చింది. ప్రపంచ దేశాలు సైతం విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించడం, దీనిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా చేస్తామని పలు దేశాలు ప్రకటించాయి. యోగాంధ్ర సహా సూర్య నమస్కారాలకు సంబంధించి రెండు గిన్నిస్ రికార్డులు రాష్ట్ర ప్రభుత్వానికి అందామి, అయితే ఎంత మంచి కార్యక్రమం చేపట్టినా సహజంగానే విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి.

ఈ క్రమంలో కీలకమైన రెండు విమర్శలను గమనించాలి. ఒకటి కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చిన విమర్శ. దీనిని ఆధారాలతో సహా చూపించారు. అయితే దీనిలో ప్రభుత్వం తప్పు ఉందని ఎవరు చెప్పకపోయినా, దీనిని భవిష్యత్తులో సరి చేసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం నొప్పి చెబుతుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తాను యోగాలో పాల్గొనలేదని, కానీ యోగాలో పాల్గొని సక్సెస్ చేశారంటూ సందేశం వచ్చిందని అభినందనలు చెబుతున్నామని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు చూపించారు.

నిజానికి యోగేంద్ర కార్యక్రమానికి సంబంధించి ఓ ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. యోగేంద్రలో రిజిస్టర్ అయిన వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసుకున్న పేర్లకు సంబంధించి వారు ఫోన్ లకు సమాచారాన్ని పంపించారు. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లి పాల్గొన్న వారిని, పాల్గోని వారిని కూడా ఇందులో చేర్చినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వంపై మాత్రం విమర్శలు వచ్చాయి. ఇక, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు చూస్తే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మంచి నీళ్ల ప్రాయంగా వెచ్చించార‌ని దీనివల్ల ఏంటి ప్రయోజనం అని ప్రశ్నించారు.

వాస్తవానికి రాష్ట్రానికి గుర్తింపు రావడం కోసం అంతర్జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రం గురించి చర్చించే పరిస్థితి రావడం కోసం చంద్రబాబు తపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై బలమైన గ‌ళం వినిపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి అవకాశం ఏపీకి దక్కింది. దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒకరకంగా పెట్టుబడులు వచ్చేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు... పెట్టిన పెట్టుబడిగా యోగాను భావించాల్సి ఉంటుంది. తద్వారా అంతర్జాతీయ దృష్టి, విశాఖపట్నం సహా ఆంధ్రప్రదేశ్ పై పడటం ద్వారా భవిష్యత్తులో మేలు జరుగుతుంది.

ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీని ఫలాలు త్వరలోనే అందుతాయి అని, ఎవరో ఏదో అన్నారని నేను దానికి సమాధానం చెప్పబోన‌ని కూడా అన్నారు. గతంలో గుజరాత్ లోని సూరత్‌లో 1,7,000 మందితో ఇలానే యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లోను ఇలానే విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సూరత్ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన సూరత్... ఇప్పుడు పెట్టుబడుల్లో దూసుకుపోతోంది. అట్లానే విశాఖపట్నం కూడా పెట్టుబడులు రావాలనేది ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చంద్రబాబు లక్ష్యం. కాబట్టి యోగాపై విమర్శల విష విన్యాసాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదనేది టిడిపి నాయకుల వాద

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now