4’ క్రాస్ రోడ్స్ కామన్.. మరి ‘8’ క్రాస్ రోడ్స్ ఊన్న ఊరి ఫోటో చూడాల్సిందే

నాలుగు కూడల రోడ్లను తరచూ చూస్తేనే ఉంటాం. అందుకు భిన్నంగా ఆరేడు రోడ్ల చౌరస్తాలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి.

HYDERABAD:నాలుగు కూడల రోడ్లను తరచూ చూస్తేనే ఉంటాం. అందుకు భిన్నంగా ఆరేడు రోడ్ల చౌరస్తాలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. అందుకు భిన్నంగా ఎనిమిది కూడళ్లు ఉన్న ఊరి గురించి తెలుసా? అంటే తెల్లముఖం వేస్తాం. అదేమీ తప్పు కూడా కాదు. తెలుగు రాష్ట్రాల్లో మరే ఊళ్లోనూ లేని విధంగా ఎనిమిది కూడళ్లు ఉన్న ఊరు ఒకే ఒక్కటుందని చెబుతారు. ఈ ఊరు గురించి.. ఒకే చోట ఎనిమిది కూడళ్లు ఉండే క్రాస్ రోడ్స్ ఫోటో ఆసక్తికరంగానే కాదు.. వావ్ అనేలా చేస్తుంది.

ఇంతకూ ఈ సిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది? అన్న ప్రశ్నకు సమాధానం.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల క్రేందంలో ఇలాంటి సిత్రం దర్శనమిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని కడప.. శ్రీకాకుళం లో ఏడు రోడ్ల కూడళ్లు ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి అవి పాపులర్ కూడా. అందుకు భిన్నంగా ఊట్నూరు మాత్రం రోటీన్ కు భిన్నం. ఇక్కడ ఏకంగా ఎనిమిది కూడళ్లు ఉండటం ఈ ఊరి ప్రత్యేకత. 

తెలుగురాష్ట్రాల్లో అరుదైన సర్కిళ్లలో ఇదొకటిగా చెబుతుంటారు. దీన్ని వినాయకచౌక్ గా పేరుంది. ఉట్నూరు మండల కేంద్రంలో విద్య.. వైద్యం.. వాణిజ్యం.. టెలికాం.. తపాలా..పోలీసు.. అటవీశాఖ.. ఐటడీఏ.. మందిరం.. మసీదు.. చర్చిలు రోడ్లను చుట్టేస్తుంటాయి. ఈ కూడలి వద్ద ప్రతి ఏడాది వినాయకచవితి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఎనిమిది కూడళ్లు ఉన్న ఈ సర్కిల్ కు సంబంధించిన డ్రోన్ షాట్ ను చూస్తే.. నోటి నుంచి అప్రయత్నంగా వావ్ అనే మాట రాకుండా మానదు.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now