జనసేవే జనార్ధనసేవకు ప్రతిరూపం – ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు


ఏలూరు, ఫిబ్రవరి 08: జనసేవయే జనార్ధనసేవ అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ, దాతృత్వంతో చిరకాలం గుర్తుండిపోయే సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా, ఆదర్శవంతంగా నిర్వహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. సేవలోని పునీతమైన ఉదాత్తతే ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.


తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజకీయాల్లోనే కాకుండా సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోన్న ఎమ్మెల్యే చంటి, ఈ సందర్భంగా వృద్ధులు, నిరాశ్రయులతో కలిసి నిరాడంబరంగా కేక్ కట్ చేశారు.

అనంతరం అక్కడ ఉన్న వృద్ధులు, నిరాశ్రయులతో కాసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే చంటి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆపై స్వయంగా వృద్ధులకు, నిరాశ్రయులకు భోజనాలను వడ్డించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సేవా స్ఫూర్తి నినాదాన్ని అందిపుచ్చుకుని దాతృత్వంతో ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులేనన్నారు. కష్టాల్లో ఉన్నవారికి అందించే చిన్న సాయం కూడా వారి జీవితాల్లో పెద్ద మార్పుకు దారి తీస్తుందని తెలిపారు. అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని, అవి అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం అను, ట్రస్ట్ సభ్యులు మారం జైసూర్య, విజయ్ వర్మ, లాయర్ సురేష్, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, కొండ్రెడ్డి వాసు, మాస్టారు శ్రీను, తోట శ్రీనివాస్, మెరుగు నాగార్జున, సత్యనారాయణ, గోల్డ్ వాసు, ఆర్కే రామకృష్ణ, మల్లిపూడి రాజ, కాసా ప్రసాద్, రంబ శ్రీను, కాక్రోల్ గణేష్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యే బడేటి చంటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now