ఇమ్రాన్ అరెస్ట్: ఇస్లామాబాద్‌ హింసాత్మకం, ఆర్మీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు

 
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అనంతరం ఇస్లామాబాద్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చేపట్టిన ఈ నిరసనల్లో అయిదుగురు పోలీసులు గాయపడ్డారని ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన 43 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) తమ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
సాయంత్రం 4 గంటల తర్వాత జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటి బయట పీటీఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత మరింత మంది నిరసనకారులు పోగయ్యారు. తాము లాహోర్ కంటోన్మెంట్‌లోకి ప్రవేశిస్తామని నిరసనకారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక గేటు ద్వారా నిరసనకారులు కంటోన్మెంట్ లోపలికి వెళ్లారు. కంటోన్మెంట్ సమీపంలో ఉన్న వాహనాలకు ఆందోళనకారులు తగులబెట్టారు. అక్కడ కూడా పోలీసులకు, నిరసనకారుల మధ్య గొడవ జరిగింది. వాహనాలకు నిప్పు పెట్టే సమయంలో అక్కడ పేలుళ్లు కూడా సంభవించాయి.